విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రమాణస్వీకారం రోజు చెప్పిన మాట ప్రకారం కులమత పార్టీలకతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి దే అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. గురువారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 17వ డివిజన్, 79 వ సచివాలయం పరిధిలో పర్యటించిన అవినాష్ ప్రభుత్వం ద్వారా వారి కుటుంబాలకు అందుతున్న సంక్షేమ లబ్ది వివరాల కరపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ గడపగడపకు వస్తున్న నాయకులకు ప్రజలు బ్రహ్మరథం పడుతూ స్వాగతం పలుకుతుంటే చాలా సంతోషంగా ఉందని, మేము టీడీపీ లో క్రియాశీలకంగా తిరుగుతున్న సరే ఆ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి సంక్షేమ పథకాలు అందలేదని, కానీ నేడు వైసీపీ ప్రభుత్వం లో వాలంటీర్లు నేరుగా మా ఇంటి వద్దకే వచ్చి సంక్షేమ పథకాలు అందిస్తుంటే చాలా ఆనందంగా ఉందని ప్రజలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఇదేమి ఖర్మ అంటూ రాష్ట్ర పర్యటన చేస్తూ తన ప్రచార ఆర్భాటాలు కోసం జన సమీకరణాలు చేసి సరైన పర్యవేక్షణ లేక అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని విమర్శించారు. నిన్న కందుకూరు లో జరిగిన ఘటన గాని, నాడు అధికారంలో ఉన్నప్పుడు పుష్కరాల సమయంలో ఫోటో షూట్ కోసం వందలాది మంది ప్రాణాలు పోవడానికి గాని ఆయనే బాధ్యుడు అని దుయ్యబట్టారు. మీ ఉనికి కోసం ప్రజల ప్రాణాలు తీస్తారా, వారి కుటుంబాలకు ఎవరు పెద్ద దిక్కు అని అవినాష్ ప్రశ్నించారు. మీరు ఎన్ని కార్యక్రమాలు చేసిన, ఎన్ని మీటింగ్ లు పెట్టీ బలవంతంగా ప్రజలను తీసుకెళ్లిన వారు ఓటు మాత్రం సంక్షేమ పాలన అందిస్తున్న జగన్ గారికే వేస్తారని ధీమా వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో 17వ డివిజన్ కార్పొరేటర్ తంగిరాల రామిరెడ్డి, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, నాగవంశ కార్పొరేషన్ డైరక్టర్ ఎర్నేటి సుజాత వైసిపి నాయకులు కాశీ, తాజుద్దీన్, వెంకటేశ్వరావు, తిరుపతిరెడ్డి, సుధాకర్, దామోదర్, గీతా కుమారి, జయమ్మ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News