-ప్రభుత్వ వైద్యులపై నమ్మకం కలిగేలా సేవలందించండి.
-మాత శిశు మరణాల నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టండి…
-గర్భిణీ స్త్రీలకు యాంటినేటల్ పరీక్షలు సకాలంలో నిర్వహించండి.
-జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రమాదకరమైన డెలివరీ సమయంలో గర్భిణీ స్త్రీని బ్రతికించాలన్న పట్టుదల, తపన అవసరం వైద్యులలో కలగాలని హై రిస్క్ డెలివరీలను ముందుగానే గుర్తించి జాగ్రత్త చర్యలను తీసుకుని ప్రభుత్వ వైద్యులపై నమ్మకం కలిగేలా సేవలందించి మాత శిశు మరణాలను నివారించాలని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు వైద్యాధికారులను ఆదేశించారు.
మాత శిశు మరణాల నివారణ, హై రిస్క్ డెలివరీలు, ఐరన్ టాబ్‌లెట్ల వినియోగంపై శుక్రవారం జిల్లా కలెక్టర్ డిల్లీరావు ఆయన కార్యాలయంలో నుండి వైద్యాధికారులతో సమావేశం నిర్వహించారు. సమావేశం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మాత శిశు మరణాలను పూర్తి స్థాయిలో నివారించడం పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ప్రమాదకరమైన డెలివరీ సమయంలో గర్భిణీ స్త్రీని బ్రతికించాలన్న పట్టుదల, తపన అవసరమన్నారు. నవంబరు, డిసెంబర్ మాసాలలో జిల్లాలో 1843 ప్రసవాలు జరిగయన్నారు. ప్రసవం సమయంలో నలుగురు తల్లులు , ముగ్గురు శిశువులు మరణించడం జరిగిందన్నారు. మరణాలకు గల కారణాలను పూర్తి స్థాయిలో అన్వేషించి తగు జాగ్రత్తలు తీసుకుని మరణాలను నివరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. గర్బిణి 20 ఏళ్ళలోపు టీనేజ్ గర్భిణీ స్త్రీలను గుర్తించి వారి ఆరోగ్య విషయాలపై పూర్తి సమాచారాన్ని సేకరించి పొందుపరచాలన్నారు. గర్భిణీ స్త్రీలకు యాంటినేటల్ పరీక్షలు సకాలంలో నిర్వహించాలన్నారు. గర్భిణిలలో బిపి షుగర్ వ్యాధులను గుర్తించి వైద్య సహాయం అందించడంతో పాటు ఆహారపు అలవాట్లలో మార్పు తీసుకురావాలన్నారు. నెలలు నిండక ముందే వచ్చే ప్రసవాలను ముందుగానే గుర్తించి సమీపంలోని అనస్థీషియాలజిస్ట్, గైనకాలజిస్ట్ అందుబాటులో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలలో ప్రసవాలను నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. గర్భిణీ ధరించిన 45 రోజుల లోపు వివరాలను నమోదు చేసి 3 నెలల పాటు ఐరన్ ఫోలిక్ యాసిడ్ సి విటమిన్‌లను అందజేయాలన్నారు. మతా శిశు మరణాలు నివారించడంలో కేరళ రాష్ట్రం అగ్ర స్థానంలో ఉందని జిల్లాకి చెందిన వైద్యుల టీం కేరళలో పర్యటించి అధ్యయనం చేయాలని సూచించారు. మహిళలలో రక్తహీనతను నివారించేందుకు యుక్త వయస్సు నుండే బాలికలకు ఐరన్ టాబ్‌లెట్లను ప్రభుత్వం సరఫరా చేస్తుందన్నారు. ప్రభుత్వం సరఫరా చేసిన ఐరన్ టాబ్‌లెట్లను అంగన్‌వాడీ కేంద్రాలు పాఠశాలలు, కళాశాలలకు పంపిణీ చేయవలసిన బాధ్యత జిల్లా వైద్యాధికారి శిశు సంక్షేమ అధికారులదే అన్నారు. పంపిణీ చేసిన టాబ్‌లెట్లను వినియోగించేలా పర్యవేక్షించాల్సి బాధ్యత అంగన్‌వాడీ సూపర్‌వైజర్లు, ఏఎన్‌యంలపై ఉందన్నారు. ఆకస్మిక తనిఖీలతో ఐరన్ టాబ్‌లెట్లను వినియోగించడం లేదని గుర్తిస్తే సూపర్‌వైజర్లు, ఏఎన్‌యంలపై చర్యలు తీసుకుంటామన్నారు. మధ్యాహ్న భోజన పథకం ద్వారా ఆహారంలో కోడిగుడ్లను సరఫరా చేస్తే తెల్ల సొనను మాత్రమే వినియోగించి పౌష్టికాహారం ఉన్న పచ్చ సొనను పారవేస్తున్నారని ఇటువంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. హై రిస్క్ డెలివరీలను గుర్తించి ఎప్పటికప్పుడు జాబితాను సమర్పించాలని కలెక్టర్ డిల్లీరావు వైద్య అధికారులను ఆదేశించారు.
సమావేశంలో డియంహెచ్‌వో డా. యం సుహాసిని, డిప్యూటి డియంహెచ్‌వో డా. వై నళినిదేవి, జిజిహెచ్, పిహెచ్‌సి వైద్యులు డా. కల్యాణి, డా.పద్మావతి, డా.చైతన్య, డా.సుశీల, డా. క్రాంతికిరణ్, డా.హిమబిందు, డా.మధురిమ, డా. వాసంతి, డా. సుమ, డా. దివిజ, వైద్యాధికారులు, ఎ.ఎన్.ఎం లు, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News