విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రైల్వే విద్యుదీకరణలో భాగంగా విజయవాడ కేంద్రంలో వివిధ ప్రాజెక్టుల్లో పని చేసిన సుమారు 200 మంది రైల్వే ఉద్యోగులు ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఆర్యీ మిత్రమండలి విజయవాడ కన్వీనర్ కే సాయిబాబా ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలు విజయవాడ సౌత్ సెంట్రల్ మజ్దూర్ యూనియన్ హాల్లో శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా సాయిబాబా మాట్లాడుతూ 1981 వ సంవత్సరం నుండి 2000 సంవత్సరాల మధ్య రైల్వే విద్యుతి కరణలో భాగంగా 300 మంది ఉద్యోగులు కలసి విజయవాడ కేంద్రంలో పనిచేసినట్లు తెలిపారు. అన్న పని చేసి పదవీ విరమణ పొందిన ఉద్యోగులందరం ఆర్యీ మిత్రమండలి గా ఏర్పడ్డామని తెలియజేశారు. ప్రతి సంవత్సరం ఇలానే ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసుకొని అందరం కలవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. రైల్వే శాఖలోvఅత్యున్నత పదవులలో పదవి విరమణ చెంది 75 సంవత్సరాలు దాటిన పలువురు ఉద్యోగస్తులను ఘనంగా సన్మానించినట్లు తెలియజేశారు. అలానే మాతో పాటు పనిచేసే మా మధ్య లేని మిత్రులు పలువురు మరణించారని విచారణ వ్యక్తం చేశారు, వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ ఘన నివాళులు అర్పించినట్లు తెలియజేశారు. శుక్రవారం ఉదయం జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం మొదలైన ఈ కార్యక్రమం సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలతో ముగిసిందని, పలువురు కుటుంబ సమేతంగా ఈ కార్యక్రమానికి హాజరైనందుకు సాయిబాబా సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం నిర్వహణలో ఆర్ సత్యనారాయణ, డి గోవిందరాజులు, ఎస్ వెంకటేశ్వరరావు, ఎం శ్యాం సుందర్ బాబ్జీ, కే దిలీప్ కుమార్, బి తిమోతి తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారని తెలిపారు.
Prajavartha Online Telugu News