Breaking News

అభివృద్ధితో భవిష్యత్తుకు భరోసా

– రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
-ఎమ్మెల్యే చేతులమీదుగా రూ.4.74 కోట్లతో నిర్మించిన నూతన రహదారుల ప్రారంభం
-రూ. 15.35 లక్షల వ్యయంతో శానిటరీ ఇన్స్ పెక్టర్ కార్యాలయానికి భూమిపూజ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగే విధంగా అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. వాంబేకాలనీలో జి-బ్లాక్ వద్ద రూ. 4.74 కోట్ల వ్యయంతో నిర్మించిన నూతన రహదారులను నియోజకవర్గ పరిశీలకులు కడవకొల్లు నరసింహారావు, నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం కండ్రికలో రూ. 15.35 లక్షల వ్యయంతో నిర్మించనున్న శానిటరీ ఇన్స్ పెక్టర్ కార్యాలయ భవన నిర్మాణానికి స్థానిక కార్పొరేటర్ యరగొర్ల తిరుపతమ్మతో కలిసి భూమిపూజ నిర్వహించారు. తెలుగుదేశం గత ఐదేళ్ల పాలనలో నియోజకవర్గానికి చేసింది శూన్యమని.. నగర అభివృద్ధికి కేటాయించిన నిధులను కూడా దారి మళ్లించారని ఈ సందర్భంగా మల్లాది విష్ణు ఆరోపించారు. కానీ వైఎస్సార్ సీపీ ప్రభుత్వం కోట్ల రూపాయల నిధులతో నియోజకవర్గాన్ని సుందరమయం చేసే విధంగా చర్యలు చేపడుతోందని తెలిపారు. పనుల్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ.. వేగంగా చేసేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా రూ. 3 కోట్లతో నిర్మించిన వాంబే కాలనీ ప్రధాన రహదారితో పాటు రూ. కోటి 56 లక్షలతో నిర్మాణం పూర్తిచేసుకున్న 18 అంతర్గ రహదారులు, రూ. 18 లక్షలతో డి-బ్లాక్ కళ్యాణమండపం రోడ్డును ప్రారంభించుకోవడం జరిగిందన్నారు. అలాగే కండ్రికలో రూ. 15.35 లక్షల వ్యయంతో శానిటరీ ఇన్స్ పెక్టర్ కార్యాలయ భవన నిర్మాణ పనులను ప్రారంభించుకున్నట్లు మల్లాది విష్ణు తెలిపారు. స్థానిక కార్యాలయాల ఏర్పాటుతో పారిశుద్ధ్య సేవలను మరింత విస్తృతం చేసేందుకు అవకాశం ఏర్పడుతుందని తెలియజేశారు. తెలుగుదేశం గత ఐదేళ్ల పాలనలో ఈ పనులన్నింటినీ మరుగున పడవేసినందుకు ప్రజలకు టీడీపీ నేతలు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అనంతరం స్థానికులతో కలిసి మొక్కలను నాటారు. కార్యక్రమంలో డీఈ గురునాథం, ఏఈ మౌసమి, నాయకులు బెవర నారాయణ, బత్తుల దుర్గారావు, యరగొర్ల శ్రీరాములు, ఆర్.ఎస్.నాయుడు, ఇస్మాయిల్, సుభాని, జిల్లెల్ల శివ, ఎస్.కె.ఇస్మాయిల్, మేడా రమేష్, వీఎంసీ సిబ్బంది, స్థానికులు, పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *