Breaking News

అభివృద్ధిలో సీఎం వైఎస్ జగన్ కు మరెవరూ సాటిరారు

-రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
-నగర మేయర్ తో కలిసి రూ. 95.90 లక్షలతో నిర్మించిన నూతన రహదారుల ప్రారంభం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అభివృద్ధిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మరెవరూ సాటిరారని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 23 వ డివిజన్లో రూ. 95.90 లక్షల వ్యయంతో నిర్మించిన గోవిందరాజులనాయుడు వీధి, విష్ణువర్థన్ రావు వీధి, నరసింహనాయుడు వీధులలో నూతనంగా నిర్మించిన సీసీ రహదారులను నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, వైఎస్సార్ సీపీ డివిజన్ ఇంఛార్జి ఆత్మకూరు సుబ్బారావులతో కలిసి ఆయన ప్రారంభించారు. గత తెలుగుదేశం ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమాన్ని పూర్తిగా తుంగలో తొక్కి ప్రజలను నిలువునా మోసగించిందని మల్లాది విష్ణు ఆరోపించారు. వందలాది కుటుంబాలు నివసించే కాలనీలపైనా కనీసం దృష్టి సారించలేకపోయారని మండిపడ్డారు. వైఎస్సార్ సీపీ అధికారం చేపట్టిన తర్వాత నియోజకవర్గంలో దశలవారీగా అభివృద్ధి పనులు చేపట్టి నిర్ణీత కాలవ్యవధిలో పూర్తి చేస్తున్నట్లు వెల్లడించారు. రోడ్లు, డ్రెయిన్లు, త్రాగునీరు ఇలా ప్రజలకు మెరుగైన సేవలందిస్తూ.. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా రూ. 76.10 లక్షల వ్యయంతో గోవిందరాజులనాయుడు వీధి, విష్ణువర్థన్ రావు వీధులలో సీసీ రోడ్లు., రూ. 19.80 లక్షల వ్యయంతో నరసింహనాయుడు వీధిలో సీసీ రహదారిని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు వెల్లడించారు. దీని ద్వారా దాదాపు 1,100 కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుందని వివరించారు. గత మూడున్నరేళ్ల కాలంలో డివిజన్లో రూ. 3.25 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టినట్లు మల్లాది విష్ణు తెలిపారు. వీటిలో రూ. 1.25 కోట్ల పనులు పూర్తి కాగా.. రూ. 1.36 కోట్ల పనులు వివిధ దశలలో ఉన్నట్లు తెలిపారు. మరో రూ. 63 లక్షల పనులు త్వరలో ప్రారంభిస్తామని తెలియజేశారు. 14వ ఆర్థిక సంఘం నిధులలో అట్టా రత్తయ్య వీధి, శివాలయం వీధులలో రహదారులను పూర్తి చేసుకున్నట్లు మల్లాది విష్ణు పేర్కొన్నారు. అలాగే ప్రకాశం రోడ్డు, కలెక్టర్ బంగ్లా రోడ్డు, గవర్నర్ బంగ్లా రోడ్డు, కస్తూరిభాయిపేట పుష్ప హోటల్ సెంటర్ నుంచి జంక్షన్ వరకు రహదారులను నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు వెల్లడించారు. గత తెలుగుదేశం హయాంలో నిర్లక్ష్యానికి గురై అభివృద్ధికి నోచుకోని ఈ ప్రాంతం.. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఓ మోడల్ డివిజన్ గా రూపుదిద్దుకుంటోందని ఉద్ఘాటించారు.

నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ.. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో పాలన సాగిస్తున్నారని తెలిపారు. గత తెలుగుదేశం హయాంలో నగరం పూర్తి నిర్లక్ష్యానికి గురైందని.. ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలను కల్పించడంలోనూ ఘోరంగా వైఫల్యం చెందారని ఆరోపించారు. అమరావతి మోజులో పడి.. విజయవాడ నగరాన్ని స్మార్ట్ సిటీ కాకుండా తీవ్ర అన్యాయం చేశారన్నారు. వైఎస్సార్ సీపీ అధికారం చేపట్టాక నగరంలో పనులు శరవేగంగా జరుగుతున్నాయని.. ముఖ్యంగా మల్లాది విష్ణు గారి నేతృత్వంలో సెంట్రల్ నియోజకవర్గం ప్రగతిలో దూసుకుపోతోందని తెలియజేశారు. కార్యక్రమంలో డీఈ గురునాథం, స్థానిక కార్పొరేటర్ బాలస్వామి, డివిజన్ కోఆర్డినేటర్ ఒగ్గు విక్కీ, నాయకులు ఆత్మకూరి వెంకట అప్పారావు, చల్లా సుధాకర్, శేషన్ మురళి, పండు, పసుమర్తి రాజేష్, కొల్లిపర శ్రీను, యర్రంశెట్టి అంజిబాబు, శివారెడ్డి, వీఎంసీ సిబ్బంది, స్థానికులు, పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *