Breaking News

గ్రామ / వార్డు సచివాలయ సిబ్బంది ప్రజలకు మెరుగైన సేవలందించండి…

-జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌ నూపూర్‌ అజయ్‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది సమర్థవంతంగా పనిచేస్తూ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలని జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌ నూపూర్‌ అజయ్‌ అన్నారు.
నగరపాలక సంస్థ పరిధిలోని సింగ్‌ నగర్‌ స్టేడియంలోని వార్డు సచివాలయాన్ని బుధవారం జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌ నూపూర్‌ అజయ్‌ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జాయింట్‌ కలెక్టర్‌ మాట్లాడుతూ వార్డు సచివాలయాల పరిధిలో ప్రజలనుండి అందిన ఫిర్యాదులను సంబంధిత అధికారులకు తెలియపరిచి ఆయా సమస్యలను పరిష్కరించడంతోపాటు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సకాలంలో లబ్దిదారులకు అంధించే విధంగా సిబ్బంది మెరుగైన సేవలందించాలన్నారు. సచివాలయ పరిధిలోని గృహానిర్మాణపథకం, ఓటిఎస్‌, పెన్షన్‌, నిత్యావసర వస్తుల సరఫరా, పారిశుద్ద్య కార్యక్రమాలపై సిబ్బంది దృష్టి పెట్టాలన్నారు. తడి,పొడి చెత్తను వేరువేరుగా పారిశుద్ద్య కార్మికులకు అందించే విధంగా ప్రజలను చైతన్యవంతులుగా చేయాలన్నారు. సచివాలయానికి వచ్చే సమస్యలు మరల తిరిగి రాకుండా సంబందిత అధికారులతో శాశ్వత పరిష్కార దిశగా కృషి చేయాలన్నారు. సచివాలయంలో సిబ్బంది హాజరు పట్టిక, ఉద్యోగుల మూమ్మెంట్‌ రిజిస్టర్‌, సంక్షేమ పథకాల క్యాలెండర్‌ , ఎస్‌ఎల్‌ఏ గడువులోగా ప్రజా సమస్యల పరిష్కార చర్యల నివేదిక, ప్రభుత్వ పథకాల పోస్టర్లు తదితర వాటిని జాయింట్‌ కలెక్టర్‌ నూపూర్‌ అజయ్‌ పరిశీలించారు. సచివాలయ ఉద్యోగులు బయోమెట్రిక్‌ అటెండెన్స్‌ ప్రతి రోజూ తప్పనిసరిగా నమోదు చేయాలని ఆదేశించారు. సమస్యలను అప్పటికప్పుడే పరిష్కరించి ప్రజల మన్నలను పొందాలన్నారు. ఇప్పటివరకు సచివాలయాలనికి వచ్చిన సర్వీసులు, పరిష్కరించిన వాటి వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. వార్డు పరిధిలో లబ్దిదారుల జాబితాను జాయింట్‌ కలెక్టర్‌ పరిశీలించారు. సచివాలయాలకు సమస్యల పరిష్కారానికి వచ్చే ప్రజలతో సిబ్బంది స్నేహపూర్వకంగా వ్యవహరించాలని జాయింట్‌ కలెక్టర్‌ నూపూర్‌ అజయ్‌ అన్నారు.
ఆకస్మిక తనిఖీలో తహశిల్థార్‌ దుర్గాప్రసాద్‌ ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *