గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
నగర ప్రజలకు కీలకమైన త్రాగునీటి సరఫరాలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని, సమ్మర్ యాక్షన్ ప్లాన్ వరకు వేచి ఉండకుండా ఎప్పటికప్పుడు రిజర్వాయర్లు, ఫిల్టరేషన్ పాయింట్స్, పైప్ లైన్ల మరమ్తత్తులు చేపట్టాలని నగర కమిషనరు కీర్తి చేకూరి, ఐ.ఏ.యస్. ఇంజినీరింగ్ అధికారులకు స్పష్టం చేశారు. బుధవారం కమిషనరు ఏటుకూరులోని చెరువు చుట్టూ ఏర్పాటు చేసిన ఫెన్సింగ్, రిజర్వాయర్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ఫిల్టర్ బెడ్స్, తక్కెల్లపాడు హెడ్ వాటర్ వర్క్స్ లో నిర్మాణం చేసిన సిసి రోడ్, ఫిల్టర్ బెడ్ లను పరిశీలించి, నాణ్యత, కొలతలను తనిఖీ చేసి సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో త్రాగునీటి కొరత రాకుండా, ఎక్కడా కలుషిత నీటి సరఫరా జరగకుండా పటిష్ట ప్రణాళిక ప్రకారం త్రాగునీటి సరఫరా జరగాలన్నారు. ఏటుకూరు చెరువు పరిసరాల్లోకి ఇతరులు రాకుండా గేటు ఏర్పాటు చేయాలని, రిజర్వాయర్ వద్ద ఏర్పాటు చేసిన ఫిల్టర్ బెడ్స్ పనులను త్వరగా పూర్తీ చేసి అందుబాటులోకి తేవాలన్నారు. సదరు ఫిల్టరేషన్ బెడ్స్ వలన చుట్టుపక్కల ప్రాంతాలకు త్రాగునీటిని సమృద్ధిగా ఇవ్వడానికి వీలు కల్గుతుందని పేర్కొన్నారు. అనంతరం హెడ్ వాటర్ వర్క్స్ లో నూతనంగా నిర్మాణం చేసిన సిసి రోడ్ నాణ్యత, కొలతలు, ఫిల్టరేషన్ బెడ్స్ ని పరిశీలించారు. ప్లాంట్ లో ముడి నీటి శుద్ధి వివరాలు, ప్రతి తీస్తున్న శ్యాంపిల్స్ అడిగి తెలుసుకొని, స్వయంగా ముడి నీరు, శుద్ధి చేసిన నీటి నాణ్యతను టర్బైట్ మెషిన్ ద్వారా పరిశీలించారు. నగరంలో జరిగే అభివృద్ధి పనులను ఎమినిటి కార్యదర్శులు పర్యవేక్షణ చేయాలని, రఫ్ ఎం.బుక్ ని ఎమినిటి కార్యదర్షులే సిద్దం చేయాలని ఆదేశించారు. సచివాలయాల వారిగా పనులను ఏమినిటీ సెక్రటరీలు ఎప్పటికప్పుటు పర్యవేక్షిస్తూ ఇంజినీరింగ్ అధికారులకు పనుల పురోగతిపై వివరాలు అందించాలన్నారు.
సచివాలయ కార్యదర్శులతో మాట్లాడుతూ కార్యదర్శులు ప్రభుత్వం నిర్దేసించిన మేరకు టీం వర్క్ తో విధులు నిర్వహించాలన్నారు. పారిశుధ్య పనులు పక్కాగా జరిగేలా అందరూ సంయుక్త భాద్యత తీసుకోవాలన్నారు. పర్యటనలో కార్పొరేటర్ దాసరి లక్ష్మీ దుర్గ, ఎస్.ఈ. భాస్కర్, ఈ.ఈ.లు కొండారెడ్డి, శాంతిరాజు, డి.ఈ.ఈ.లు శివకుమార్, కళ్యాణ రావు, ఏ.ఈ.లు రాంబాబు, రవికిరణ్, బాబర్, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News