Breaking News

సరుకు రవాణా ద్వారా రూ.10,000 కోట్ల రాబడి దాటినా దక్షిణ మధ్య రైల్వే

-ఈ ఘనత కేవలం 9 నెలల 16 రోజులు వ్యవధిలో జోన్ చరిత్రలోనే అత్యంత వేగవంతంగా సాధించింది.

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సరుకు రవాణా కార్యకలాపాల ద్వారా దక్షిణ మధ్య రైల్వే జోన్ రూ.10,000 కోట్ల రాబడిని నమోదు చేయడం ద్వారా మరో మైలురాయిని చేరుకున్నాయి. ఈ ప్రగతిని కేవలం 9 నెలల 16 రోజులలో చేరుకోవడం జరిగింది .ఇది జోన్ ప్రారంభమైనప్పటి నుండి అత్యంత వేగవంతమైనది. అంతకుముందు అనగా 9 మార్చి 2019న 343 రోజులలో రూ. 10,000 కోట్ల సరుకు రవాణా రాబడిని సాధించింది. సరుకు రవాణా విభాగం నిరంతరం కృషి చేయడం మూలాన కొన్ని రోజుల క్రితం దక్షిణ మధ్య రైల్వే 100 మిలియన్ టన్నుల లోడింగ్ మార్కును దాటింది. సరుకు రవాణా యొక్క ఒరవడి ఆశాజనకంగా వుంది . ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి అత్యధిక సరుకు రవాణా లోడింగ్ ను చేరుకోవడానికి దక్షిణ మధ్య రైల్వే బృందం నిరంతరం కృషిచేస్తోంది.
కొత్తగా సరకు రవాణాను ఆకర్షించడానికి మరియు ఇతర రవాణా మార్గాలకు మళ్లించబడిన రవాణాను పునరుద్ధరించడానికి జోన్ వ్యాపార అభివృధ్ధికోసం ఏర్పాటుచేసిన యూనిట్లు ద్వారా అలాగే ఆపరేటింగ్ యూనిట్లు ,కమర్షియల్ అధికారులు మరియు సిబ్బంది నిరంతరం శ్రమిస్తున్నాయి. సరుకు రవాణా వినియోగదారులతో, అధికారులు అవిశ్రాంతంగా శ్రమిస్తూ సరుకు రవాణా వినియోగదారులకు అందిస్తున్న పాలసీ/విధానాలను, కార్యక్రమాలు మరియు ప్రోత్సాహకాలను వారికీ వివరిస్తున్నారు. ఈ ప్రయత్నాలన్నిటి మూలాన సరుకు రవాణా విభాగంలో అన్ని ప్రక్రియల్లో వృద్దికి దారితీశాయి.
సరుకు లోడింగ్ ప్రధాన వస్తువు బొగ్గు. మొత్తం లోడింగ్లో 50% కంటే ఎక్కువ దోహదపడుతుండగా, సిమెంట్ 26% లోడింగ్కు దోహదం చేస్తుంది. లోడింగ్ లో దాదాపు 11% ఆహార ధాన్యాలు మరియు ఎరువులతో కలిపి లోడింగ్ సమకూర్చుతుండగా మిగిలిన ఇతర వస్తువుల ద్వారా లోడింగ్ చేయబడుతుంది. దక్షిణ మధ్య రైల్వేకు ప్రధాన సరుకు రవాణాదారు సింగరేణి కాలరీస్ . దీనివల్ల థర్మల్ పవర్ ప్లాంట్లు మరియు సిమెంట్ ప్లాంట్లకు బొగ్గును రవాణా జరుగుతుంది. కోవిడ్ లాక్డౌన్ నుండి ఆహార ధాన్యాలు మరియు ఎరువుల లోడ్ గణనీయంగా పెరిగింది మరియు దేశవ్యాప్తంగా ఆహార సరఫరా గొలుసును సమతుల్యం చేయడంలో సహాయపడింది.
సరకు రవాణా విభాగంలో రూ. 10,000 కోట్ల రాబడిని సాధించినందుకు, దక్షిణ మధ్య రైల్వే ఆపరేటింగ్ మరియు కమర్షియల్ విభాగాల బృందాన్ని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ అభినందించారు. రైల్వే లో సరకు రవాణాకు ప్రాధాన్య మార్గంగా మార్చడంతో పాటు అదే స్థితిని కొనసాగించాలని బృందానికి సూచించారు. సరుకు రవాణా జరుగుతున్న తీరు, అలాగే ఆ విభాగంలో కొత్త పుంతలు తొక్కేందుకు జోన్ ను సిద్ధం చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. జోన్ లో సరకు రవాణా జరుగుతున్న తీరు, ఆ విభాగంలో కొత్త శిఖరాలను అధిరోహించేందుకు సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *