-ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి రాజీలేని పోరాటం..
-సమస్యలను పరిష్కరించకుంటే ప్రత్యక్ష పోరాటానికి సిద్దం..
-ఏపి ఎన్జివో నేతలు బండి శ్రీనివాసరావు, కె.వి. శివారెడ్డి.
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఉద్యోగుల ప్రయోజనాలే లక్ష్యంగా నూతన కార్యవర్గం పనిచేస్తుందని ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని సమస్యలను పరిష్కరించకుంటే ప్రత్యక్ష పోరాటానికి సిద్దంగా ఉంటామని ఏపిఎన్జివో అసోసియేషన్ రాష్ట్ర సంఘానికి నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు బండి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి కె.వి. శివారెడ్డి తెలిపారు.
ఏపిఎన్జివో అసోసియేషన్ రాష్ట్ర సంఘానికి నూతన కార్యవర్గ ఎన్నిక బుధవారం విజయవాడ గాంధీనగర్‌లోని ఏపిఎన్జివో హోమ్ నందు నిర్వహించారు. రాష్ట్ర కార్యవర్గానికి అధ్యక్షు కార్యదర్శులుగా పోటీ చేస్తున్న బండి శ్రీనివాసరావు, కె.వి. శివారెడ్డి వారి ప్యానల్ అభ్యర్థులు వివిధ జిల్లాల నుండి విచ్చేసిన ఉద్యోగ సంఘ నాయకులు మరియు ఉద్యోగులతో కలిసి ఏలూరు రోడ్డు పాత బస్టాండ్ నుండి బారీ ర్యాలీగా బయలు దేరి ఎన్టివో హోమ్‌కు చేరుకుని ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. కార్యవర్గంలోని ఒక్కొక్క పదవికి ఒక్కొక్క అభ్యర్థి మాత్రమే నామినేషన్ దాఖలు చేయడంతో పోటీలో ఉన్న అభ్యర్థులు గెలిపొందిన్నట్లు ఎన్నికల అధికారి జి. రామకృష్ణా రెడ్డి ప్రకటించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో రాష్ట్ర సంఘానికి అధ్యక్షులుగా ఎన్నికైన బండి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని తమపై నమ్మకంతో రాష్ట్ర సంఘానికి రెండవ సారి అధ్యక్షులుగా ఎన్నికోవడం పట్ల కృతజ్ఞత తెలియజేస్తున్నానన్నారు. ఉద్యోగుల ప్రయోజనాలే ప్రధాన అజెండాగా ఏపిఎన్జివో రాష్ట్ర నాయకత్వం పనిచేస్తుందన్నారు. ఉద్యోగులకు సంబంధించి డిఏ బకాయి పిఆర్సి బకాయి చెల్లింపు జిపిఎఫ్ ఇన్సూరెన్స్ సరెండర్ లీవ్ వంటి బిల్లుల చెల్లింపు పై ప్రభుత్వం తాత్సారం చేయడం తగదన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిని కలిసిన సందర్భంలో సంక్రాంతి పండుగకు డిఏ మంజూరు చేస్తామని తెలిపిన విషయాన్ని తాము ఉద్యోగులకు తెలియజేశామన్నారు. డిఏ మంజూరు చేయకపోవడంతో ఉద్యోగులలో ఉన్న నిరాశను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చామని, త్వరలో డిఏను మంజూరు చేస్తామని హామి ఇచ్చారన్నారు. 11వ పిఆర్సిలో ఉద్యోగులకు అరకొర లబ్ది మాత్రమే చేకూరింద ఈ ఏడాది జూలై మాసం నుండి 12వ పిఆర్సి అమలు చేయాల్సి వుందని దీనిపై కమిటీని నియమించాలని ప్రభుత్వం పిఆర్సి కమిటీ వేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామని బండి శ్రీనివాసరావు తెలిపారు.
ప్రధాన కార్యదర్శి కె.వి. శివారెడ్డి మట్లాడుతూ సిపిఎస్ రద్దుతో పాటు అనేకమైన డిమాండ్లు సంవత్సరాలు తడబడి అపరిస్కృతంగా ఉన్నాయన్నారు. సమస్యల పరిష్కారంపై ఉద్యోగుల సంఘాలతో సమావేశాలు నిర్వహిస్తున్నారే తప్ప వాటిని పరిష్కారించేందుకు అడుగులు ముందుకు వేయడం లేదన్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం పట్ల ఉద్యోగులు తీవ్ర నిరాశకు గురి అవుతున్నారన్నారు. మూడున్నర సంవత్సరాలుగా ప్రభుత్వం ఉద్యోగ సమస్యలను పరిష్కరిస్తుందనే ఆశతో ఉద్యోగులు ఎదురు చూస్తున్నారని ప్రస్తుత పరిస్థితులలో ఉద్యోగులకు సకాలంలో జీతాలు కూడా చెల్లించడం లేదన్నారు. ఉద్యోగుల పట్ల ప్రభుత్వం చిన్న చూపు తగదని ఇప్పిటికైన ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో అందోళన బాట పట్టేందుకు ఉద్యోగులు సిద్ధంగా ఉండాలని కె.వి. శివారెడ్డి ఉద్యోగులకు పిలుపునిచ్చారు.
ఏపిఎన్జిఓ రాష్ట్ర సంఘానికి ఏకగ్రీవంగా ఎన్నికైన నూతన కార్యవర్గం:
ఏపిఎన్జివో అసోసియేషన్ రాష్ట్ర సంఘ అధ్యక్షులుగా బండి శ్రీనివాసరావు (జలవనరులు శాఖ, ఒంగోలు) ప్రధాన కార్యదర్శిగా కె.వి శివారెడ్డి (వైద్య ఆరోగ్య శాఖ, వైఎస్సార్ కడపజిల్లా), సహాధ్యక్షలుగా సిహెచ్ పురుషోత్తంనాయుడు (కమర్షియల్ టాక్స్ శాఖ, శ్రీకాకుళం), కార్యనిర్వహక కార్యదర్శిగా కె. జగదీశ్వరరావు (మైనర్ అండ్ మీడియం ఇరిగేషన్ శాఖ, విజయవాడ), కోశాధికారిగా ఎ. రంగారావు (మైనర్ అండ్ మీడియం ఇరిగేషన్ శాఖ, విజయవాడ), ఉపాధ్యక్షలుగా డి.వి. రమణ ( వైద్య ఆరోగ్య శాఖ, విజయనగరం), వై. ప్రసాద్ (వైద్యఆరోగ్య శాఖ, వైస్సార్ కడప), పి. శ్రీనివాస్ ( వైద్య ఆరోగ్య శాఖ, తూర్పుగోదావరి), వి. దస్తగిరిరెడ్డి (వైద్య ఆరోగ్య శాఖ, కర్నూల్), జె. మాదవ్ (వైద్య ఆరోగ్య శాఖ, అనంతపురం), ఎ. శ్రీనివాసరావు (వైద్య ఆరోగ్య శాఖ, కృష్ణాజిల్లా) పి శ్రీనివాసులు (వైద్య ఆరోగ్య శాఖ, భీమవరం) ఎస్ కె నాగూర్ షరీఫ్ ( వైద్య ఆరోగ్య శాఖ, గుంటూరు), ప్రచార కార్యదర్శిగా బి. జానకి (ఆయుష్ శాఖ, విజయవాడ), కార్యదర్శులుగా వి. సుబ్బారెడ్డి (వైద్య ఆరోగ్య శాఖ, విజయవాడ) ఎస్ బి.వి రాంప్రసాద్, (వ్యవసాయ శాఖ, గుంటూరు), ఏ రంజిత్‌కుమార్ నాయుడు ( డైరెక్టర్ ఆఫ్ ఇన్సూరెన్స్, మంగళగిరి), యంవి కృష్ణారెడ్డి (దేవాదాయ శాఖ, విజయవాడ), పి. శివప్రసాద్ ( పే అండ్ ఎకౌంట్స్, మంగళగిరి), మహిళా కార్యదర్శిగా పి. తులశీరత్నం (సర్వే శాఖ, విజయవాడ) లు ఏకగ్రీవంగా ఎన్నికైయ్యారు. నూతన కార్యవర్గాన్ని ప్రభుత్వ సలహాదారులు (ఉద్యోగుల సంక్షేమం) ఎన్ చంద్రశేఖర్‌రెడ్డి, జెఎసి నాయకులు హృదయరాజు, బొప్పరాజు వెంకటేశ్వర్లు, వైవి రావు ఎన్టీఆర్ కృష్ణా జిల్లాల అధ్యక్షులు ఏ విద్యాసాగర్, ఉల్లి కృష్ణ, కర్నూల్ జిల్లా అధ్యక్షులు సిహెచ్ వెంగళరెడ్డి, గుంటూర్ జిల్లా అధ్యక్షులు ఘంటాసాల శ్రీనివాసరావు, పశ్చిమ జిల్లా అధ్యక్షులు సిహెచ్ శ్రీనివాస్ రావు, శ్రీకాకుళం అధ్యక్షులు సాయిరాం, కడప జిల్లా అధ్యక్షులు బి. శ్రీనివాస్, చిత్తూరు జిల్లా అధ్యక్షులు రాఘవులు, వివిధ జిల్లాల అధ్యక్ష కార్యదర్శిలు, ఉద్యోగ సంఘ నాయకులు, పెన్షనర్ల సంఘ నాయకులు, ఉద్యోగులు అభినందలు తెలిపారు.
Prajavartha Online Telugu News