Breaking News

811 ఉరుసు గంధమహోత్సవానికి అత్యంత అరుధైన అపురూపమైన చాదర్…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సూఫీ మహాత్ముల బాట అనుసరణీయం అని మైనారిటి సంక్షేమ శాఖ ప్రత్యెక కార్యదర్శి ఏ.ఎండి. ఇంతియాజ్ పేర్కొన్నారు. శుక్రవారం విజయవాడ లోని వక్ఫ్ బోర్డు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ వక్ప్ బొర్డు చైర్మన్ వి ఖాదర్ భాషతో కలిసి రాష్ట్ర ప్రభుత్వము తరపున సుఫి మహాత్ములు హజరత్ ఖాజాగరీబ్ నవాజ్ ఉరుసు మహొత్సవంలో అందజేయనున్న ప్రత్యెక చాదర్ ను అయన మీడియాకు చూపించారు. ఈ సందర్భంగా ఇంతియాజ్ మాట్లడుతూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అలోచన మేరకు మైనారిటి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ వక్ప్ బోర్డు వచ్చేనెల అజ్మీర్ షరిఫ్ లో జరగనున్న 811 ఉరుసు గంధమహోత్సవానికి అత్యంత అరుధైన అపురూపమైన చాదర్ తయారు చేయడం జరిగిందన్నారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక చాదర్ ను సమర్పించనున్నామని ఏ.ఎండి. ఇంతియాజ్ అన్నారు.
ఆంధ్రప్రదేశ్ స్టేట్ వక్ప్ బొర్డు చైర్మన్ వి ఖాదర్ బాషా మాట్లడుతూ ముఖ్యమంత్రి వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డి మదిలో సుఫి మహాత్ముల హజరత్ ఖాజా గరీబ్ నవాజ్ గారి పట్ల ఉన్న అభిమానం తో ప్రభుత్వము తరపున ప్రత్యెక చాదర్ సమర్పించాలని తమకు తెలియపర్చారన్నారు. ముఖ్యమంత్రి అలోచనకు అనుగుణంగానే మైనారిటి సంక్షేమ శాఖా ఆధ్వర్యంలో వక్ప్ బొర్డు ప్రత్యెక చాదర్ ను సమర్పించనుందన్నారు. వక్ప్ బొర్డు ఆధికారులు, ముస్లిం ప్రముఖులు ఈ చాదర్ ను తీసుకుని ఈనెల 22 న విజయవాడ నుంచి అజ్మీర్ షరిఫ్ కు బయలుదేరనున్నారన్నారు. హజరత్ ఖాజాగరీబ్ నవాజ్ మహాత్ముల వారి గంధమహోత్సవంలో రాష్ట్ర ప్రభుత్వ చాదర్ కుడా భక్తి ప్రపత్తులతొ అజ్మీర్ సర్కార్ వారికి అలంకరించడం జరుగుతుందన్నారు. ఈ విలేకరుల సమవేశంలో వక్ప్ బొర్డు మెంబెర్ శీరీన్ బేగం, వక్ప్ బొర్డు సిఇవో ఎల్.అబ్దుల్ ఖాదిర్ తదితరులు పాల్గోన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *