విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
చూపు మందగించడం దూరపు వాహనాలను గమనించలేకపోవడం రోడ్డు ప్రమాదాలకు కారణలవుతున్నాయని, దృష్టి లోపాలు కలిగిన డ్రైవరులు ఎప్పటికప్పుడు కంటి పరీక్షలను చేయించుకోవాలని డిటిసి యం పురేంద్ర కోరారు. స్థానిక బందరు రోడ్డులోని డీటీసీ కార్యాలయంలో శనివారంనాడు రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా డ్రైవర్లకు ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. వైద్య శిబిరాన్ని డిటిసి యం పురేంద్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా డీటీసీ యం పురేంద్ర మాట్లాడుతూ డ్రైవర్లు ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఈ ప్రమాదాలను తగ్గించగలమని కొంతమంది డ్రైవర్లు కంటి చూపు మందగించినప్పటికి నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతున్నారని, దృష్టి. లోపాలతో వాహనాలు నడుపుట వలన దూరంగా వచ్చే వాహనాల రాకపోకలను గుర్తించలేకపోవడం చాల ప్రమాదాలకు దారితిస్తున్నాయని డీటీసీ అన్నారు. దృష్టి లోపం ఉన్న డ్రైవర్లు కంటి పరీక్షలను తరచుగా చేయించుకొంటు అవసరమైన మందులను వాడటం, కంటి అద్దాలను పెట్టుకోవడం చేయాలన్నారు. ఆరోగ్యం పట్ల ఎప్పుడు నిర్లక్ష్యం వహించవద్దని కోరారు. డ్రైవర్లు ఆరోగ్యంగా ఉంటేనే ప్రయాణికులు సురక్షితంగా ఇంటికి చేరుతారన్నారు. డిటిసి కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరంలో 300 మందికి పైబడి డ్రైవర్లకు పరీక్షలు చెయ్యడంతో పాటు, అవసరమైన అన్ని పరీక్షలు ఉచితంగా అందించమన్నారు. కంటి పరీక్షలు బీపీ షుగర్ సాధారణ పరీక్షలను నిర్వహించడం జరిగిందన్నారు. ఉచిత వైద్య శిబిరానికి డ్రైవర్ల నుండి మంచి స్పందన వచ్చిందన్నారు. పిన్నమనేని సిద్ధార్థ జనరల్ హాస్పటల్ వైద్య నిపుణులైన డాక్టర్ల బృందంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. డాక్టర్ల బృందానికి డిటిసి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఆర్టీవో ఆర్ జగదీశ్వర్ రాజు, మోటార్ వాహన తనిఖీ అధికారులు ఆర్ ప్రవీణ్, కె వెంకటేశ్వరరావు, ఎస్ శ్రీనివాస్, పరిపాలన అధికారులు సిహెచ్ శ్రీనివాసరావు, అబ్దుల్ సత్తార్, ఏపీ రవాణా శాఖ ఉద్యోగుల సంఘం జోనల్ అధ్యక్షుడు యం రాజుబాబు, వైద్య బృందంబి వసంత, ఎస్ సుజిత, కె రామ్ చరణ్, కె సంజిత, జె నుర్వ, ఏ నిఖిల్, మరియు డ్రైవర్లు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News