Breaking News

ఆర్టిసి ఉద్యోగుల సేవలు ఆదర్శంగా ఉండాలి…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజా రవాణా వ్యవస్థలో ఆర్టిసి ద్వారా అత్యధికంగా ప్రజలను ఒక చోట నుంచి మరొక చోటుకు చెర్చే సేవలో ఆర్టిసి ఉద్యోగుల సేవలు ఆదర్శంగా ఉండాలని జిల్లా రవాణా అధికారి కె వి కృష్ణా రావు పేర్కొన్నారు. స్థానిక ఆర్టిసి కార్యాలయంలో ఆదివారం 34 వ జాతీయ రహదారి భద్రత వారోత్సవాల్లో భాగంగా ఆర్టిసి డ్రైవర్లకు, సిబ్బందికి అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరైయ్యారు.

ఈ సందర్భంగా జిల్లా రవాణా అధికారి కే వి కృష్ణా రావు మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాలు జరిగిన సందర్భాల్లో మరణాలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. వాహనాల నిర్వహణ పై అవగాహన, ఎప్పటి కప్పుడు మరమ్మత్తు చర్యల ద్వారా  జరుగుతున్న ప్రమాదాలు మరియు మరణాల సంఖ్యను తగ్గించడం సాధ్యం అవుతుందని అన్నారు. బ్లాక్‌స్పాట్‌ల వద్ద అప్రమత్తత, రహదారి సూచికలను పాటించడం, ట్రాఫిక్ అనుగుణంగా రోడ్ల విస్తరణ ఆవశ్యకత, డ్రైవర్లను అప్రమత్తం చేసేందుకు జీపీఎస్ సిస్టమ్, డ్రైవింగ్ శిక్షణ (ఇప్పటికే ఉన్న మరియు ఔత్సాహిక డ్రైవర్లకు) అందించడం ద్వారా నిరంతరం నైపుణ్యం పెంచు కావాలని అన్నారు. కంటి పరీక్షలను క్రమ పద్ధతిలో చేసుకోవడం చాలా అవసరం అన్నారు.

ఆర్టిసి డిపో మేనేజర్ ఎస్కే షబ్నం మాట్లాడుతూ, ఆర్టిసి డ్రైవర్లు ప్రజా రవాణాలో విశిష్ట సేవలు అందిస్తు అత్యధిక ప్రయాణికులను వారి వారి గమ్య స్థానాలకు చేరవేస్తు గొప్ప సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికులు, అంకిత భావంతో విధులు నిర్వహిస్తు ట్రాఫిక్ నియమాలపై సంపూర్ణ అవగాహన కలిగి వుండి వాటిని కచ్చితంగా పాటించాలన్నారు. ఒక ఆర్టీసీ డ్రైవర్ చేతిలో 50 మందికి పైన ప్రయాణికుల ప్రాణాలు ఉంటాయి. కావున మీరు ఎంతో నిబద్ధతతో విధులు నిర్వహించాలని ఉంటుందని ఆమె తెలిపారు.

జిల్లా ప్రజా రవాణా అధికారి కే. షర్మిలా అశోక కొంతమంది డ్రైవర్లు కంటి చూపు మందగించినప్పటికి నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతున్నారని, దృష్టిలోపాలతో వాహనాలు నడుపుట వలన దూరంగా వచ్చే వాహనాల రాకపోకలను గుర్తించ లేకపోవడం చాల ప్రమాదాలకు దారి తిస్తున్నాయని అన్నారు. దృష్టి లోపం ఉన్న డ్రైవర్లు కంటి పరీక్షలను తరచుగా చేయించుకొంటు అవసరమైన మందులను వాడటం, కంటి అద్దాలను పెట్టుకోవడం చేయాలన్నారు. ఆరోగ్యం పట్ల ఎప్పుడు నిర్లక్ష్యం వహించవద్దని కోరారు. రహదారి భద్రత పై అవగాహన అవసరం అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సంపత్, ఆర్టిసి, రవాణా శాఖ అధికారులు, డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

హంద్రీనీవా జలాలకు సీఎం జల హారతి

-కుప్పం బ్రాంచ్ కెనాల్ వద్ద ప్రత్యేక పూజలు -బీరగానిపల్లె రిజర్వాయర్ శంకుస్థాపన శిలాఫలకం ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు అమరావతి, నేటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *