భీమవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఇటీవల పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పట్టణానికి చెందిన చినిమిల్లి వెంకటరాయుడు ని, సీఎం జగన్మోహన్ రెడ్డి ఉభయ జిల్లాల వైయస్సార్ సేవాదళ్ కన్వీనర్ గా నియమించడం జరిగింది. ఈ సందర్భంగా ఆదివారం పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పట్టణం రాయలంలో వైయస్సార్ సేవాదళ్ కన్వీనర్ చినిమిల్లి వెంకటరాయుడు అధ్యక్షతన మండలాల కన్వీనర్ల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరు వెంకట నాగేశ్వరావు, భీమవరం శాసనసభ్యులు గ్రంధి శ్రీనివాస్, వైయస్సార్ సేవాదళ్ రాష్ట్ర కన్వీనర్ కోటంరెడ్డి గిరిందర్ రెడ్డి, ఏపీ ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ పెండ్ర వీరన్న, జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ వేండ్ర వెంకటస్వామి, జిల్లా వైఎస్ఆర్ పార్టీ మహిళా అధ్యక్షురాలు గూడూరు ఉమ్మ బాలలు పాల్గొని మాట్లాడారు. వివిధ హోదాలు కలిగిన నాయకులు వైయస్సార్ సేవాదళ్ జిల్లా మండల కన్వీనర్లు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News