Breaking News

నేషనల్ మెడికల్ అసోసియేషన్, ఏపీ 30వ వార్షికోత్సవ వేడుకలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నేషనల్ మెడికల్ అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్ 30 సంవత్సరాలు పూర్తిచేసున్న సందర్భంగా ఆదివారం  విజయవాడ, సిద్దార్ధ ఆడిటోరియం లో 30 సంవత్సరాల వార్షికోత్సవ సభ జరిగింది. ఈ కార్యక్రమంకి ముఖ్య అదితి గా విజయవాడ నగర పాలక సంస్థ మేయర్ పాల్గొని అసోసియేషన్ సభ్యులు ఐక్యతగా వుంటూ సభ్యుల సంక్షేమం కోసం,ఆయుర్వేద వైద్యం ప్రజలందరి అందేటట్లు నేషనల్ మెడికల్ అసోసియేషన్ సభ్యులైన ఆయుర్వేద వైద్యులు కృషి చేయాలి అన్నారు. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ విజయభాస్కర్ మాట్లాడుతూ సబ్యులకు ఇన్సూరెన్స్ సదుపాయం కలిగించడం,న్యాయపరమైన సహకారం అందించడం, ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరాలు నిర్వహిండం,ఆరోగ్య శ్రీ లో ఆయుర్వేదం చేర్చేటట్లు ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్లడం, సభ్యులకు ఫ్యామిలీ బెనిఫిట్ స్కీం ఏర్పాటు జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ వేముల భాను ప్రకాష్ మాట్లాడుతూఆయుర్వేద క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ఏర్పేడటట్లు చూడటం, స్టేట్ ఆయుర్వేదిక్ మెడికల్ కౌన్సిల్ ఏర్పేటట్లు చూడటం, ఆయుర్వేద ఆసుపత్రులకు రీఎంబ్రాసిమెంట్ ఏర్పాటు అయ్యేటట్లు చూడటం, ఆయుర్వేద గ్రాడ్యుయేట్స్ కి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చేటట్లు ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్లి పై సమస్యలు ప్రభుత్వం అండతో పూర్తయేటట్లు అసోసియేషన్ ద్వారా కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో భాగంగా నేషనల్ మెడిసిన్ సావనీర్ మేయర్ విడుదల చేశారు. తదుపరి నూతన కార్యవర్గం పరిచయ కార్యక్రమం,అనంతరం బెస్ట్ టీచర్, బెస్ట్ మెడికల్ ఆఫీసర్, బెస్ట్ ఆయుర్వేద ప్రాక్టీషనేర్, అవార్డు లు అందచేశారు. పి.జి.మరియు యు.జి విభాగాలలో అత్యుత్తమ మార్కులు వచ్చిన వారికి గోల్డ్ మెడల్ తో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి డాక్టర్ వెంకట రమణ, కృష్ణ జిల్లా ప్రెసిడెంట్ డాక్టర్ చిన్నరాజు, ఇంప్పీకప్స్ ప్రెసిడెంట్ డాక్టర్ ఆర్.కన్నన్, డాక్టర్ చల్లా హరికుమార్, డాక్టర్ జి.వి.పూర్ణచందు డాక్టర్ మల్లుప్రసాద్, డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ సాయి సుధాకర్, డాక్టర్ రాంప్రకాష్, డాక్టర్ జి.వరుణ్ మరియు అసోసియేషన్ సభ్యులు 450 మంది పాల్గొన్నారు.

 

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *