Breaking News

అజయ్ కల్లాం పూర్తి స్థాయి సమీక్ష

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
వై యస్ ఆర్ జగనన్న శాశ్వత పై ప్రాంతీయ సమావేశానికి ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు అజయ్ కల్లాం ముఖ్య అతిథిగా హాజరు కానున్నారని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత పేర్కొన్నారు. స్థానిక కలెక్టరేట్ లో సోమవారం రాత్రి సంబంధిత శాఖల అధికారులతో జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ తో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డా కె. మాధవీలత మాట్లాడుతూ, తూర్పు గోదావరి, డా అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ, ఏలూరు జిల్లాలకు చెందిన అధికారులతో వై ఎస్ ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూ రక్షా పథకం పై స్టీరింగ్ మరియు అమలు కమిటీ చైర్మన్ ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు అజయ్ కల్లాం పూర్తి స్థాయి సమీక్ష నిర్వహించడం జరుగుతుందన్నారు. ఆ సమావేశానికి పూర్తి స్థాయి సమాచారం తో హాజరు కావాలని ఆదేశించారు. స్థానిక కలెక్టరట్ సమావేశ మందిరంలో సోమవారం ఉదయం 10 గంటలకు సమావేశానికి హాజరు కావాలన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిన్నతనంలోనే కండరాల క్షీణత గుర్తింపుపై ప్రత్యేక దృష్టి: మంత్రి కందుల దుర్గేష్

-అమరావతి రేర్ డిసీజెస్ ఆర్గనైజేషన్ ఫౌండర్ శోభారాణి సుంకర సేవలు అభినందనీయమని కొనియాడిన మంత్రి దుర్గేష్ అమరావతి, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *