Breaking News

పశ్చిమ నియోజకవర్గంలో నారా లోకేష్ జన్మదిన వేడుకలు

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త :
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువ నాయకులు నారా లోకేష్ జన్మదిన సందర్భంగా సొమ‌వారం విజయవాడ పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు టీం టిడిపి విజయవాడ పశ్చిమ నాయకుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ… దగాపడిన రాష్ట్ర యువతకు అండగా, చదివిన చదువుకు ఉద్యోగాలు లేక నిరాశ చెందిన యువత అండగా ఈనెల 27వ తారీఖున కుప్పం నుంచి పాదయాత్రకు శ్రీకారం చుట్టిన నారా లోకేష్ యువ గళం పాదయాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి పెందుర్తి శ్రీనివాస్, మైనారిటీ నాయకులు ఎమ్ ఎస్ బేగ్, జిల్లా కార్యాలయ కార్యదర్శి సారిపల్లి రాధాకృష్ణ, అనుబంధ సంఘాల నాయకులు సుకాశి సరిత, యర్రా రామారావు, నమ్మి భాను ప్రకాష్, సయ్యద్ ఇమ్రాన్, జిల్లా ఐటిడిపి అధ్యక్షులు అద్దేపల్లి శివ, బూర కనకరావు, టీమ్ టిడిపి విజయవాడ పశ్చిమ నియోజకవర్గ డివిజన్ పార్టీ అధ్యక్షులు, నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *