విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మొదలుపెట్టిన ప్రతి పనిని శరవేగంగా పూర్తి చేస్తూ అభివృద్ధి లో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారు అని తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. శనివారం నాడు తూర్పు నియోజకవర్గ పరిధిలోని 4వ డివిజన్ గురునానక్ కాలనీ లో దాదాపు 15లక్షల రూపాయల ప్రభుత్వ నిధులతో BT రోడ్ అవినాష్ శంకుస్థాపన చేసారు అదేవిధంగా CTO కాలనీ నందు ఉన్న పార్కు కు కాలనీ పెద్దల కోరిక మేరకు తంగేళ్ళముడి భాస్కరరావు పార్కు గా నామకరణం చేయడం జరిగింది.ఈ సందర్భంలో అవినాష్ మాట్లాడుతూ ఇదే డివిజన్ లో దాదాపు కోటి 20లక్షల రూపాయల నిధులతో నిర్మాణలు పూర్తి చేసుకున్న పలు రోడ్లు ను ప్రారంభించి ప్రజలకు అందుబాటులో కి తీసుకొచ్చాం అని అన్నారు .4వ డివిజన్లో ఉన్న అన్ని కాలనీ లలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ మూడేళ్ళ కాలంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చొరవతో విజయవాడ నగరంలో ఏ డివిజన్లో లేని విదంగా 4వ డివిజన్ లోనే దాదాపు 10కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని తెలిపారు. టీడీపీ ఎమ్మెల్యే, ఎంపీ,కార్పొరేటర్ ఉండి కూడా గత 5 సంవత్సరాలు ఈ డివిజిన్ అభివృద్ధి ని పట్టించుకోలేదు, వైసీపీ ప్రభుత్వం పూర్తి చేసిన పనుల వద్ద ఫోటోలు దిగి వారి ఘనత గా ప్రచారం చేసుకోవడం సిగ్గు చేటు అని విమర్శించారు.గత తెలుగుదేశం పార్టీ హయాంలో తూర్పు నియోజకవర్గం అబివృద్దికె నోచుకోలేదు మా జగన్మోహన్ రెడ్డి గారి చొరవతో దాదాపు 400కోట్లు తో అభివృద్ధి చేసాం అన్నారు. తెలుగుదేశం పార్టీ చేసే అసత్య ప్రచారాలు ప్రజలు అంతా గమనిస్తున్నారని రాబోయే రోజుల్లో మీకు గట్టిగా బుద్ధి చెబుతారని హెచ్చరించారు. జగన్ గారు రాష్ట్రం అంతా సమ అభివృద్ధి చెందాలని ఓడిపోయిన సరే తూర్పు నియోజకవర్గ అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసారని, రాబోయే 30 సంవత్సరాలు ఆయనే ముఖ్యమంత్రి గా ఉండాలని ప్రజలు అంత కోరుకొంటున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో 4వ డివిజన్ డివిజన్ ఇన్ ఛార్జ్ గల్లా పద్మావతి,డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ,కో ఆప్షన్ సభ్యులు ముసునూరి సుబ్బారావు,గల్లా రవి,రవీంద్ర,జేజే సింగ్,బత్తుల ప్రసాద్,తరుణ్,కరం కౌర్,రామచంద్రా రెస్య్,మన్మోహన్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News