విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్, మంగళవారం ఆటోనగర్ లోని 6 వ రోడ్డు నందు గల డంపింగ్ యార్డ్ ను పరిశీలించి వివరాలు అడిగితెలుసుకోనిన సందర్భంలో ప్లాంట్ ట్రాన్స్ ఫర్ స్టేషన్ నందలి చెత్త వాహనాలు నిలిచిపోవడం చూసి నూతనంగా వేయింగ్ మిషన్ బ్రిడ్జి ఏర్పాటు చేయాలనీ, పారిశుధ్యo మరియు అండర్ గ్రౌండ్ డ్రెయినేజి నిర్వహణ విధానమును పరిశీలించి అధికారులకు పలు ఆదేశాలు ఇచ్చారు. విధులలో పారిశుధ్య కార్మికులు మరియు శానిటరీ సెక్రటరీల పని తీరును పరిశీలించి పలు ఆదేశాలు ఇచ్చారు. పర్యటనలో ఎగ్గిక్యుటివ్ ఇంజనీర్ సత్యనారాయణ, శానిటరీ ఇన్స్ పెక్టర్లు మరియు సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News