విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా నిన్న 21వ డివిజన్, కృష్ణలంక రణధీర్ నగర్ కట్ట ప్రాంతంలో పర్యటించినప్పుడు స్థానిక నిరుపేద కుటుంబానికి చెందిన రేణుక ఆమె కుమారుడి అనారోగ్యం (హార్ట్ లో హోల్) గురుంచి తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ దృష్టికి తీసుకురాగా గురువారం నాడు వారికి దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మందుల ఖర్చు నిమిత్తం 10,000/-రూపాయల ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది అని అన్నారు. ప్రభుత్వం ద్వారా అర్హులైన అందరికి సంక్షేమ పథకాలు అందజేయడం తో పాటు, నగరంలో అవసరమైన వారికి మా దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సామాజిక సేవ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది అని అవినాష్ తెలిపారు.
Prajavartha Online Telugu News