విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో పేద ప్రజల సంక్షేమం, ఆర్థికాభివృద్ధి ధ్యేయంగా వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ పాలన సాగుతోందని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. శుక్రవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 21వ డివిజన్ లో 104వ సచివాలయ పరిధిలోని హరిజన సేవా సంఘం నుండి మొదలై,పీతా బసవయ్య రోడ్, రజక స్ట్రీట్,మెట్లబజార్ రోడ్,ఓల్డ్ పోలీస్ స్టేషన్ రోడ్ ప్రాంతాలలో నాయకులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లతో కలిసి ఇంటింటికి వెళ్లిన అవినాష్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ క్యాలెండర్ ను అందజేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రతి కుటుంబానికి లబ్ది చేకూరే విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన అందిస్తున్నారని, కేవలం మూడేళ్ళ కాలంలోనే 98శాతం పైగా హామీలు అమలు చేసిన ఘనత ఆయనదే అని అన్నారు. ప్రతి సంక్షేమ పధకంలో కూడా మహిళలకు, పేదవారికి పెద్దపీట వేస్తున్నారని తెలిపారు. టీడీపీ నేత నారా లోకేష్ రాజ్యాంగం చేతిలో పేట్టుకొని యువగళం అంటూ పాదయాత్ర చేస్తున్నారు అని, అదేవిధంగా గత 2014 ఎన్నికల ముందు వారు ఇచ్చిన హామీల కరపత్రాలు కూడా దగ్గర పెట్టుకొని వారు అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్ని హామీలు అమలు చేశారో ప్రజలకు తెలియజేయాలని సవాల్ విసిరారు. సినిమా డైలాగులు చెబితే ప్రజలు హర్షించారు అని, అందుకే మీ యాత్రలో డబ్బులు ఇచ్చిన సరే ప్రజలు రాక వెలవెల పోతుంది అని ఎద్దేవా చేశారు. మీరు పాదయాత్ర కాదు కదా పొర్లు దండాలు పెట్టె యాత్ర చేసిన టీడీపీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని విమర్శించారు. ఇక్కడి ప్రాంత ప్రజలు చేత్తపన్ను సమస్య గురించి మా దృష్టికి తీసుకువచ్చారని ఇంతకు ముందే ఆ విషయం కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి 140 ఉన్న చెత్తపన్ను ను 30 రూ లకి తగ్గించాలి అని కోరడం జరిగిందని, మరొకసారి ఆ విషయం గురుంచి మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో 21వ డివిజన్ కార్పొరేటర్ పుప్పాల కుమారి,డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ,వైస్సార్సీపీ నాయకులు పుప్పాల రాజా,టి,పి రెడ్డి,మద్దెల పవన్,గోగు గౌరీ,మెడ రమేష్,మూలం రెడ్డి సుబ్బారెడ్డి,సుంకర పెద్దబ్బాయి మరియు వైస్సార్సీపీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News