విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా పార్టీ కార్యాలయంలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర తెలుగు మహిళా అధికార ప్రతినిధి యార్లగడ్డ సుచిత్ర మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన ఎక్కువైపోయిందన్నారు. మా యువ నాయకుడు నారా లోకేష్ యువ గళం పాదయాత్రను చూసి జగన్ రెడ్డికి వెన్నులో వణుకు పడుతుందన్నారు. ప్రజలను చూస్తే జగన్ రెడ్డికి భయం! లోకేష్ కి ఉత్సాహం. పరదాల చాటున జగన్ రెడ్డి ప్రయాణిస్తాడు, మా యువ నాయకుడు నారా లోకేష్ ప్రజల మధ్యనే తిరుగుతాడు. అది జగన్ రెడ్డికి లోకేష్ కి ఉన్న తేడా గమనించాలన్నారు. లోకేష్ పాదయాత్రకు మైకు పర్మిషన్ ఇవ్వకుండా, స్టేజి పర్మిషన్ ఇవ్వకుండా డ్రోన్ కెమెరాలతో చిత్రీకరిస్తూ అడుగడుగున ఆటంకాలు జగన్ రెడ్డి ప్రభుత్వం సృష్టిస్తుందని, ఎన్ని కుయుక్తులు పన్నినా మా యువ నాయకుడు పాదయాత్ర ముందుకు సాగుతుందన్నారు. జగన్ రెడ్డి పాలనలో నాసిరకం మద్యం తాగి ఎన్ని కుటుంబాలు నాశనం అయ్యాయో, ఎంతోమంది మహిళలు రోడ్డున పడ్డారన్నారు. దోచుకోవడం, దాచుకోవడం తప్ప ఈ జగన్ రెడ్డికి ఏమీ తెలియదు అన్నారు. లోకేష్ పాదయాత్ర లో జనం మళ్ళీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే మా జీవితాలు బాగుపడతాయని, మా పిల్లలకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని వారి ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. చంద్ర బాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీ రకంగా ప్రవర్తించి ఉంటే నీ తండ్రి రాజశేఖర రెడ్డి, జగన్ రెడ్డి, నీ చెల్లి షర్మిల పాదయాత్రలు చేసేవారా అని ప్రశ్నించారు. జగన్ రెడ్డికి గానీ, వైసీపీ నాయకులు గానీ మహిళల పట్ల గౌరవం లేదన్నారు. లోకేష్ పాదయాత్రకు మీరు ఎన్ని ఆటంకాలు కలిగించిన రాష్ట్రంలోని మహిళలు ఒక కవచం లాగా ఏర్పడి ముందుకు తీసుకువెళ్తారన్నారు. చంద్రబాబు పోరాట స్ఫూర్తి మాకు ఆదర్శం అన్నారు. ఈ సమావేశంలో మహిళా నాయకురాలు బొప్పన నీరజ, భూక్య సౌజన్య, యడ్లపల్లి నళిని తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News