Breaking News

విద్యార్థులకు పాఠ్యంశాలలో భావనాధారిత (కాన్సెప్ట్‌ బేస్‌ )బోదన అవసరం..

-ఉత్తమ విద్యతో విద్యార్థులు పరీక్షలు ఎదుర్కొనేలా సన్నద్దం చేయండి. కలెక్టర్‌ డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వ కళాశాలలో విద్యార్థులు సబ్జెక్టులపై పట్టు సాదించేందుకు భావనాధారిత (కాన్సెప్ట్‌ బేస్‌ ) విద్యబోదన అందించి ఉత్తమ ఫలితాలను సాధించేందుకు విద్యార్థులను సన్నద్దం చేయాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌. డిల్లీరావు అన్నారు.
స్థానిక రాధనగర్‌ ప్రభుత్వ జానియర్‌ కళాశాలను మంగళవారం జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు సందర్శించి ఇంటర్‌మీడియట్‌ విద్యార్థులకు అందిస్తున్న విద్యాబోదనను పరిశీలించారు. జువాలజీ, బోటని సబ్జెక్టులపై జిల్లా కలెక్టర్‌ విద్యార్థులను పలు ప్రశ్నలను అడిగి సమాదానాలను రాబట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ కళాశాలలో అధ్యాపకులు అందిస్తున్న బోదన సంతృప్తి కరంగా ఉన్నప్పటికి పాఠ్యంశాలపై భావనాధారిత (కాన్సెప్ట్‌ బేస్‌) బోదన అందించాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థులను ప్రశ్నలు అడిగినప్పుడు బృందంగా సమాదానాలు ఇస్తున్నారని అదే వ్యక్తిగతంగా ఒక్కొక్కరిని ప్రశ్నించిన్నప్పుడు సరైన సమాదానం చెప్పడంలో తడబడుతున్నారన్నారు. దీనిని నివారించేందుకు పాఠ్యాంశాలపై పట్టు సాధించేలా భావనాధారిత విద్యా బోదన అవసరమన్నారు. ఇంటర్మీడియట్‌ పరీక్షలు అసన్నమవుతున్న తరుణంలో విద్యార్థులపై మరింత ప్రత్యేక శ్రద్ద పెట్టాలని అధ్యాపకులకు కలెక్టర్‌ సూచించారు. అవసరమైతే అదనపు క్లాసులను నిర్వహించి సబ్జెక్టులలో వెనుకబడిన విద్యార్థులను ప్రత్యేక బోదనను అందించి మంచి ఫలితాలను సాధించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ కోరారు. సబ్జెక్టులలో ప్రతిభ కనపరిచే విద్యార్థులు వారు నేర్చుకున్న పాఠ్యాంశాలను మిగిలిన విద్యార్థులకు బోదించడం ద్వారా ఉత్తమ ఫలితాలను సాధించేలా ప్రణాళికతో విద్యార్థులను పరీక్షలకు సిద్దం చేస్తున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంపై ప్రత్యేక దృష్టి పెట్టి అదునాతన భవనాలను నిర్మించి మౌలిక వసతులను కల్పించడంతో పాటు సాంకేతిక పరిజ్ఞానంతో విద్యాబోదనను అందించడం జరుగుతుందని కలెక్టర్‌ డిల్లీరావు అన్నారు.
కళాశాల పరిశీలనలో జిల్లా కలెక్టర్‌ వెంట ప్రిన్సిపాల్‌ సిఎస్‌ఎస్‌ఎన్‌ రెడ్డి, అధ్యాపకులు కె. బాలరాజు, యం నిర్మలజ్వోతి, కె. శేఖర్‌బాబు, డి.సంధ్యారాణి, స్థానిక తహాశీల్థార్‌ సిహెచ్‌ దుర్గాప్రసాద్‌, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *