Breaking News

దుగ్గిరాలలో ఘనంగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వరస్వామి విగ్రహ ప్రతిష్ట


దుగ్గిరాల, నేటి పత్రిక ప్రజావార్త :
దుగ్గిరాలలో ఘనంగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వరస్వామి విగ్రహ ప్రతిష్ట మరియు నూతన జీవ ధ్వజస్తంభ ప్రతిష్ట, శాంతి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం జరిగింది. శుక్రవారం గుంటూరు జిల్లా, దుగ్గిరాల, రైలుపేటలో జరిగిన ఈ కార్యక్రమంలో శైవ క్షేత్ర పీఠాధిపతులు శ్రీ శివస్వామి పాల్గొని పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. పునర్వసు నక్షత్ర యుక్త మీన లగ్న పుష్కరాంశమునందు ఫిబ్రవరి 27 నుండి మార్చి 3 వరకు పూజా కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆలయ కమిటీ తెలిపారు. చివరి రోజు ప్రతిష్టా మహోత్సవం, ధ్వజస్తంభ ప్రతిష్ట, లోక కళ్యాణ యాగం నిర్వహించామని, వందలాదిమంది భక్తులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. విగ్రహ ప్రతిష్ట, ధ్వజ స్తంభ ప్రతిష్టకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఆలయ అర్చక స్వాములు భక్తులను ఆశీర్వదించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ కోనేరు మల్లిఖార్జునరావు, కంభంపాటి క్రాంతి, తోకల బాలాజీ, భద్రయ్య, చుండూరు ఉమామహేశ్వరరావు, మద్దుల వెంకటరామయ్య, నేలవల్లి సాంబశివరావు తదితరులు పాల్గొని కార్యక్రమంలో భక్తులు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గుంటూరు నగరంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మహిళా ఓటర్ల గుర్తింపు ప్రక్రియ ప్రారంభం : నగర కమిషనర్ మయూర్ అశోక్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల (G.O.Rt.No. 1165, MA&UD Department) ప్రకారం గుంటూరు నగర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *