Breaking News

మహిళల ఆర్ధిక స్వాలంబనే ప్రభుత్వ లక్ష్యం.

-జిల్లా కలెక్టర్ ఎస్. ఢిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్వయం సహాయక సంఘాల మహిళలకు జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు నగరంలోని ఆయన క్యాంపు కార్యాలయం వద్ద డిఆర్ డీఏ జగనన్న చేదోడు పథకం ద్వారా నాటుకోళ్లను పంపిణీ చేశారు. ఈ సంధర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలను ఆర్ధికంగా బలోపేతం చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యం అన్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా వైఎస్సార్ క్రాంతి పథం, వైస్సార్ ఆసరా, వైస్సార్ భీమా, సున్నావడ్డీ, శ్రీనిధి, పధకాలను అమలు చేయడం జరుగుతుందన్నారు. స్వయం సహాయక సంఘం లోని ప్రతి మహిళా ఆర్ధిక పరిపుష్టి సాధించాలన్న ఉద్దేశంతో వైఎస్సార్ చేదోడు పథకం ద్వారా మంజూరు చేసిన ఆర్ధిక సహాయంతో జిల్లాలో వెయ్యి స్వయం సహాయక సంఘాల మహిళలకు నాటుకోళ్లను పంపిణీ చేస్తున్నామన్నారు. ఒక్కొక్క యూనిట్టుకు పది కోళ్లను పంపిణీచేస్టున్నామన్నారు. ఇందులో 1200 రూపాయల ఖర్చుతో నెల రోజులకు సరిపడా కోళ్ల మేతను 852 రూపాయలతో కోళ్లకు వేక్సినేషన్ వేయించి మహిళ సంఘాలకు పంపిణీచేస్తున్నట్లు తెలిపారు. 44 లక్షల రూపాయల వ్యయంతో జిల్లాలో 1000 సంఘాల సభ్యులకు కోళ్లను పంపిణి చేస్తున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా మహిళా సంఘాలకు కోళ్లను వారి గ్రామం వద్దే అందజేసేలా రవాణా సౌకర్యాన్ని కల్పించడం జరిగిందన్నారు. ఏ కారణం చేతనైన వరం రోజులలోపు సరఫరా చేసిన కోడి మరణిస్తే ఆ స్థానంలో మరియొక కోడిని ఉచితంగా అందజేయాలని అధికారులను ఆదేశించామన్నారు. సరఫరా చేసిన కోళ్లను స్వయం సహాయక బృందాల మహిళలు జాగ్రత్తగా పెంచుకోగలిగితే కోళ్ల ద్వారా ఉత్పత్తి అయిన నాటు కోడిగుడ్లు ఒక్కొక్కటి పది రూపాయల ధర పలుకుతుందని కోళ్ల సంతాన ఉత్పత్తిని పెంచుకొని వచ్చే ఆదాయం ద్వారా ఆర్ధిక కుటుంబ అవసరాలకు ఉపయోగించుకొనే అవకాశం ఉంటుందన్నారు. గతంలో స్వయం సహాయక సంఘాల మహిళలకు మేలు రకపు పాడి పశువులను పంపిణీ చేయడం జరిగిందని త్వరలో వైస్సార్ చేదోడు ఆర్ధిక సహాయానికి తోడు మరి కొంత ఆర్ధిక సహాయాన్ని మంజూరు చేయడం ద్వారా జిల్లాలో సుమారు 2000 గొర్రె పొట్టేళ్లను పంపిణీ చేయాలన్నా ఆలోచన చేస్తున్నామన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఆర్ధిక సహాయాన్ని సద్వినియోగం మహిళలు ఆర్ధిక పరిపుష్టిని సాధించాలని జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు కోరారు.
కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ కె. శ్రీనివాసరావు, ఎపియం జి. చంద్రశేఖర్, కమ్యూనిటీ కోఆర్డినేటర్స్ బి. అమ్మాయమ్మ, ఎం. రామారావు, ఎం. కాంతి శ్రీ, మండల సమైక్య అధ్యక్షురాలు పి. లియోనా, లబ్ధిదారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

భారీ వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి

-జ్వరాలు, విరేచనాల కేసులు పెరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి. -మందులు, అంబులెన్సుల విష‌యంలో ముంద‌స్తు చ‌ర్య‌లు చేప‌ట్టాలి -వైద్యులు, సిబ్బంది …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *