అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ నెహ్రు యువ కేంద్ర విజయవాడ అధ్వర్యంలో ఈ రోజు స్థానిక శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్దార్థ మహిళా కళాశాల ఆడిటోరియంలో జిల్లా స్థాయి యువ ఉత్సవ్ ఇండియా @2047 కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్య్రమానికి గౌరవ పార్లమెంట్ సభ్యులు కేశినేని శ్రీనివాస్ ముఖ్య అతిథిగా ను గౌరవ విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ సభ్యులు మల్లాది విష్ణు గౌరవ అతిధి గాను విచ్చేశారు. స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో ఈ సందర్భంగా నిర్వహించిన పెయింటింగ్ పోయెట్రీ ఫోటోగ్రఫీ డిక్లమేషన్ మరియు బృందనృత్యం విభాగాలలో గెలుపొందిన వారికి సర్టిఫికెట్లు మోడీ@20 అనే పుస్తకాన్ని బహుమతులుగా అందజేశారు అలాగే జిల్లాస్థాయి ఉత్తమ యువజన సంఘం గా ఎంపికైన అభ్యుదయ మహిళా మండలి విజయవాడ వారికి కూడా సర్టిఫికెట్ మెమెంటో అందజేశారు ముఖ్య అతిథి మాట్లాడుతూ అభివృద్ధి చెందిన దేశంగా అవతరించిన భారత వానికి రాబోయే శతజయంతి స్వాతంత్ర దినోత్సవానికి అడుగులుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపుమేరకు అమృత కాల్ పంచప్రాన్ అనే థీమ్ తో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ముదావహం అని యువత విద్యా పరంగా ఎంత ఎదిగిన వ్యక్తిగతంగా వారు తమ లో అంతర్లీనంగా ఉన్న సృజనాత్మకతను ప్రదర్శించి అన్ని రంగాల్లో రాణించాలని రాబోయే 25 సంవత్సరాలు కాలం భారతావానికి అత్యంత కీలకమని ప్రతి యువతీ యువకుడు తమ వంతు బాధ్యతగా దేశాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు మరొక గౌరవ అతిధి మల్లాది విష్ణు మాట్లాడుతూ యువతీ యువకులు తరతమ భేదాలు మరిచి వారి యొక్క ఇష్టమైన రంగాన్ని ఎంచుకొని ఆ రంగంలో రాణించి వారి బంగారు భవితను తీర్చిదిద్దుకోవాలని వారి భవితే భారత భవితని ఎటువంటి అవసరం ఉన్న అవకాశాలు అనిపించుకోవాలన్నా కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ పథకాలను అర్థం చేసుకొని ఎంపిక చేసుకొని సద్వినియోగం చేసుకోవాలని కోరారు అందుకు ప్రజాప్రతినిధులుగా తమ వంతు సహాయ సహకారాలు అందించగలమని తెలియజేశారు ఈ కార్యక్రమంలో అతిధులుగా జిల్లా యువజన సంక్షేమ అధికారి శ్రీనివాస్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ కమ్యూనికేషన్స్ ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ రమేష్ చంద్ర ఆలిండియా రేడియో శ్రీ జి కొండలరావు గారు కళాశాల డైరెక్టర్ విజయలక్ష్మి కళాశాల ప్రిన్సిపల్ కల్పన గారు ఎన్సిసి విభాగాధిపతి నాగరాణి, సరళ జిల్లా అధికారి సుంకర రాము కుమారి దేవి రెడ్డి కిరణ్మయి, శ్రీ కృష్ణ దేవరాయలు యూత్ బీమల వినోద్, యూత్ మోటివేటూర్స్ తాళ్లూరి అశోక్ జిజ్ఞాస భార్గవ్ జాలాది రిషిత, అలాగే జనసిఖ్షన సంస్థాన్, భారతీయ యువశక్తి ట్రస్ట్ KVIC, FPO, DDUGKY, PBS Blood Donation cell వివిధ కళాశాల నుంచి పోటీ నిమిత్తం విచ్చేసి పాల్గొన్న 800 మంది పైగా యువతీ యువకులు యువజన సంఘ సభ్యులు నేషనల్ యూత్ వాలంటీర్స్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు జాతీయ గీతాలపన తో ఈ కార్యక్రమం ముగిసింది.
Prajavartha Online Telugu News