Breaking News

సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనపై ప్రత్యేక దృష్టి పెట్టండి…

-పర్యావరణహిత కార్యక్రమాలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలి: డా.సమీర్ శర్మ

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
సుస్థిర అభివృద్ధి లక్ష్యాలలో భాగంగా 10-19 వయస్సు గల పిల్లలకు, గర్భిణీ స్త్రీలకు ప్రతి నెల వైద్య పరీక్షలు జరపాలని గుర్తించిన రక్తహీనత వారికి ఐరన్ (ఐ ఎఫ్ ఎ) మాత్రలు, అదనపు పౌష్టిక ఆహారం తప్పనిసరి అందించాలని, పర్యావరణహిత కార్యక్రమాలపై కలెక్టర్ లు నిరంతర పర్యవేక్షణ ఉండాలని చైర్మన్ , ఎ.పి. కాలుష్య నియంత్రణ మండలి మరియు ముఖ్యమంత్రి చీఫ్ ఎగ్జిక్యూటివ్ డా.సమీర్ శర్మ అన్నారు. శనివారం ఉదయం స్థానిక శ్రీపద్మావతి అతిధి గృహంలో జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి వారితో కలిసి చైర్మన్ సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధన అనుబంధ శాఖలతో, పర్యావరణ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
జిల్లా కలెక్టర్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరిస్తూ జిల్లాలో 0 -5 సంవత్సరాల పిల్లల ఆధార్ నమోదు తక్కువ ఉందని, 10-19 వయస్సు గల వారిలో రక్తహీనత 98376 మంది ఉన్నారని ఇందులో 15 వేలకు పైగా మాడరేట్, 77 వేలకు పైగా మైనర్ గా రక్తహీనత నమోదు ఉందని తరచూ పర్యవేక్షణ జరిపి తగ్గిస్తున్నామని అన్నారు. గర్భిణీ స్త్రీలకు సంబంధించి 4250 మంది మాడరేట్, మైల్డ్ రక్తహీనతలో ఉన్నారని తరచూ పర్యవేక్షిస్తున్నామని అన్నారు. నాయుడుపేట గురుకుల పాఠశాల పర్యటనలో గత మూడు నెలలకు ముందు 650 మంది విద్యార్థులు ఉంటె వైద్య పరీక్షల్లో 640 మందికి రక్తహీనత నమోదు అయిందని చర్యలు చేపట్టి అదనపు పౌష్టిక ఆహారంగా చిక్కీలు, గుడ్లు, పాలు వంటివి అందించి రెండు మాసాలలో పూర్తి స్థాయిలో 10 మందికి మినహా రక్తహీనత నుండి బయటపడేలా చేయగలిగామని వివరించారు. పర్యావరానికి సంబంధించి తరచూ సమీక్షలు నిర్వహిస్తున్నామని అన్నారు.
చైర్మన్ మాట్లాడుతూ రక్తహీనత గుర్తించిన పిల్లలను తప్పనిసరిగా అదనపు పౌష్టిక ఆహారం అందించి బయటపడేలా చేయాలని, మొదట సచివాలయ స్థాయిలో 100 కు పైగా నమోదు అయిన పిల్లలను గుర్తించి తగ్గించగలిగితే త్వరగా లక్ష్యాలను సాధించిన వారమవుతామని అన్నారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో భాగంగా 0-5 చిన్న పిల్లల ఆధార్ నమోదుకు ప్రత్యేక ఆధార్ క్యాంపులను ఏర్పాటు చేసి నమోదు చేయగలిగితే వీరు కూడా వైద్య పరీక్షలకు అనుసంధానం కాగలుగుతారని అన్నారు. ప్రతి పాఠశాలలో రక్తహీనత గుర్తించిన పిల్లలకు ఐ ఎఫ్ ఎ మాత్రలతో పాటు అదనపు పౌష్టిక ఆహారం అందించాలని ప్రతి నెల వైద్య పరీక్షలు నిర్వహించి అధిక రక్తహీనత కలిగిన వారిని మాడరేట్ కు మాడరేట్ లో ఉన్న వారిని మైల్డ్ కు, మైల్డ్ లో ఉన్నవారిని పూర్తి స్థాయిలో రక్తహీనత లేకుండా ఇలా మూడు స్టేజిలలో చర్యలు చేపట్టి లక్ష్యాలను సాధించాలని సూచించారు.
పర్యావరణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు 40, 81 కచ్చితంగా సింగల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం పై ప్రత్యామ్నాయం కల్పించి తయారీ పరిశ్రమలపై , డీలర్ల పై దృష్టి పెట్టి నిషేదానికి చర్యలు చేపట్టాలని అన్నారు. ప్లాస్టిక్ క్యారీ బాగులు వాడకంలో తప్పనిసరి 120 మైక్రాన్స్ వుండాలని సూచించారు. ఈ – వేస్ట్ మేనేజ్ మెంట్ పంచాయితీ , మునిసిపల్ తరచూ రీసైక్లింగ్ మానిటర్ , రీయూజ్ వుండాలని మెడికల్ వేస్ట్ పై దృష్టి పెట్టాలని అన్నారు. పరిశ్రమలు వాడిన నీటిని వాటర్ ట్రీట్ మెంట్ ప్లాంట్స్ ఏర్పాటుతో పరిశ్రమల్లో పచ్చదనం పెంపు కు వాడాలని , భూగర్భ జల వినియోగం తగ్గాలని అన్నారు. బ్యారటీ వేస్ట్ కు వాహనాలకు సంబంధించి రీ ప్లేస్ వున్నందున వినియోగం చేయడం జరుగుతుందని, హోమ్ యూజ్ చిన్న, లితియం బ్యాటరీల సేకరణకు ప్రత్యేక కేంద్రం ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని అన్నారు. కాలుష్య నియంత్రణ కోసం వాతావరణ నిర్దారణ ఎల్.ఇ.డి. బోర్డులు, అనలైజ్ మీటర్లు ఏర్పాటుతో CO 2 తగ్గింపుకు చేపట్టాల్సిన చర్యలు, మురుగునీటి ట్రీట్ మెంట్ ప్లాంట్స్ వినియోగంతో ఆనీటిని తిరిగి పరిశ్రమలకు వాడటం, చెరువులు, గుంటలు, సిగ్నల్స్ వద్ద పచ్చదనంతో పార్కుల ఏర్పాటు చూడాలని అన్నారు. జిల్లా కలెక్టర్లు తరచూ పర్యావరణ సంస్థ పై సమీక్షలు నిర్వహించాలని సూచించారు.
ఈ సమీక్షలో కాలుష్య నియంత్రణ మండలి అధికారులు కె.వి.రావు, ఎం.డి.ఎం.ప్రసాద్ , నరేంద్ర బాబు , మదన్ మోహన్, జిల్లా ప్రణాళిక అధికారి అశోక్ కుమార్ , ఆర్.ఐ.ఓ. రమేష్ , డి.ఎం.హెచ్.ఓ .శ్రీహరి, పి డి , ఐసిడిఎస్ జయలక్ష్మి, డి.ఎల్.డి.ఓ. సుశీలాదేవి, గూడూరు డి ఎల్ పి ఓ వాణి, వైద్య అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అవుట్‌ఫాల్ డ్రెయిన్ల డీసిల్టింగ్ పనులను పరిశీలించిన కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర బుధవారం ఉదయం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *