
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ, మణిపాల్ హాస్పిటల్‌లో గురువారం అంతర్జాతీయ మూత్రపిండాల దినోత్సవ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా మూత్రపిండాల సంరక్షణను అందుబాటులోకి తీసుకురావడంలో సాధించిన మైలురాళ్లను వెల్లడిరచారు. నెఫ్రాలజీ మరియు యూరాలజీ డిపార్ట్మెంట్స్ 2014లో మూత్రపిండాల మార్పిడి కార్యక్రమాన్ని ప్రారంభించాయి. ఇప్పటి వరకూ మణిపాల్ హాస్పిటల్ 64 మూత్రపిండ మార్పిడి శస్త్రచికిత్సలను చేసింది. వీటిలో 46 జీవించి ఉన్న దాతలు నుంచి సేకరించినవి కాగా 18 మరణించిన దాతలు నుంచి సేకరించినవి ఇవన్నీ కూడా 98 శాతం విజయవంతమయ్యాయి. ఈ సందర్భంగా డాక్టర్ సుదాకర్ కంటిపూడి హాస్పిటల్ డైరెక్టర్ మాట్లాడుతూ అంతర్జాతీయ మూత్ర పిండాల దినోత్సవ సందర్భంగా మూత్రపిండాల సంరక్షణ కార్యక్రమంలో భాగం కావడం పట్ల చాలా సంతోషంగా ఉన్నానని, మణిపాల్ హాస్పిటల్ విజయవాడ సాదించిన విజయాలు మరియు మెరుగైన చికిత్సలకు ఓ మైలురాయిగా ఈ కార్యక్రమం నిలుస్తుందన్నారు. డాక్టర్ ఎ.వి.ఎస్.ఎస్.ఎన్.శ్రీధర్ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ ఫిజీషియన్ మాట్లాడుతూ మూత్రపిండాల ఆరోగ్యం బాగుంటే శరీర ఆరోగ్యమూ బాగుంటుంది అందువల్ల మూత్రపిండాల సంరక్షణ పట్ల అవగాహన కల్పించడంతో పాటుగా మూత్రపిండాల స్థితికి అనుగుణంగా మెరుగైన చికిత్సను అందిచడం కీలకం అని అన్నారు. కన్సల్టెంట్ యూరాలజిస్ట్ కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ సర్జన్ డాక్టర్ రవిశంకర్ గంజి మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా తమకు దగ్గరలోనే అత్యుత్తమ సంరక్షణ సదుపాయాలు లభ్యమవుతున్నాయని తెలుసుకోగలరన్నారు. ఈ హాస్పిటల్లో టాక్రోలిమస్ బ్లడ్ లెవల్స్ అంచనా సదుపాయం ఉంది. ఆంద్రప్రదేశ్లో ఈ తరహా సదుపాయాలు కలిగిన ఒకే ఒక్క హాస్పిటల్ మణిపాల్ రాష్ట్రంలో మూత్రపిండాల మార్పిడి చేసిన మొదటి హాస్పిటల్‌గా కూడా ఇది నిలిచిందన్నారు. ఈ కార్యక్రమంలో మూత్రపిండాల శస్త్రచికిత్స చేయించుకుని కోలుకున్న ఐదు సంవత్సరాలు దాటిన కొంతమందిని సత్కరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఉత్తమ్‌శర్మ, వివిధ విభాగాల డాక్టర్లు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News