Breaking News

జిల్లాలో ఉపాధ్యాయ పోలింగ్ శాతం 82.54 శాతం.

-పట్టభద్రుల పోలింగ్ శాతం 63.56%
-229 , 233 పోలింగ్ కేంద్రాల ప్రిసైడింగ్ అధికారులు రిగ్గింగ్ జరిగిందని కేసులు నమోదు: జిల్లా కలెక్టర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో సాయంత్రం 4.00 గంటలకు పట్టభద్రుల పోలింగ్ శాతం 63.56 ఉపాధ్యాయ నియోజకవర్గ పోలింగ్ 82.54 శాతం గా నమోదయిందని ఆ తరువాత క్యూలో వేచి ఉన్న వారి ఓటింగ్ అనంతరం ఫైనల్ పోలింగ్ శాతం రావలసి ఉన్నదని జిల్లా కలెక్టర్ కె. వెంకట రమణా రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. తిరుపతి నగరంలో అన్ని పోలింగ్ స్థానాలకు ప్రశాంత పోలింగ్ కు ప్రత్యేక అధికారులను నియమించడం జరిగిందని అన్నారు. అలాగే తిరుపతి నగరంలో ప్రిసైడింగ్ అధికారులు 229 ( ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, చిన్నబజారు వీధి), 233 ( జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, సత్యనారాయణ పురం ) పోలింగ్ కేంద్రాలలో రిగ్గింగ్ జరిగిందనీ, పోలింగ్ ప్రక్రియ ఆపి కేసులు నమోదు చేయడంతో ఎన్నికల కమిషన్ కు నివేదిక సమర్పించడమైనదని జిల్లా కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *