Breaking News

పశ్చిమలో పలు మసీదులకు గంజి రవ్వను విరాళం ఇచ్చిన వెలంపల్లి

-పశ్చిమలో మసీదుల అభివృద్ధికి వెలంపల్లి అన్ని రకాల సహాయ సహకారాలు అందించారు – ముస్లిం పెద్దలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్థానిక బ్రాహ్మణ వీధిలో గల మాజీ మంత్రి పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు ఇంటి వద్ద తన కుమార్తె అయిన సాయి అశ్విత శుక్రవారం నియోజకవర్గంలో పలు మసీదులకు గంజి తయారీకి వాడే రవ్వను విరాళంగా అందించారు ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ మా తండ్రి గారైన వెలంపల్లి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు ఈ రవ్వను విరాళం ఇవ్వడం జరిగిందన్నారు.నియోజకవర్గంలో ముస్లిం సోదరులు రానున్న రంజాన్ నెలలో ఎంతో పవిత్రంగా ఉపవాస దీక్షలు చేస్తారు అని ఆ ఉపవాస విరమణ సమయంలో తాగే గంజి తయారీకి వాడే రవ్వను ఈ రోజు ఒక్కో మసీదుకు 100కేజీలు చొప్పున ఇవ్వడం జరిగిందన్నారు.ముస్లింలకు ఈ రవ్వను అందించడం ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ఆ అల్లా ఆశీస్సులు వెలంపల్లి శ్రీనివాసరావు కుటుంబంపై ఉండాలని ముస్లిం మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.మసీదులు అభివృద్ధికి కూడా వెలంపల్లి అన్ని రకాల సహకారాలు అందించారు అని తెలిపారు రానున్న కాలంలో వెలంపల్లికి సహకారం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వెలంపల్లి రాఘవ నర్సింహరావు,ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కొనకళ్ళ విద్యాధర రావు,హిస్టరీ అకాడమీ డైరెక్టర్ వాజీద్ ఖాన్ మరియు అయా మసీదులు కమిటీ సభ్యుల ముస్లిం పెద్దలు తదితరులు పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఈగల్ పోస్టర్లను, డ్రగ్స్ వద్దు బ్రో బ్యానర్ ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్, ఎస్పి లు

-ఆపరేషన్ త్రిశూల్’లో భాగంగా డ్రగ్స్, మహిళల భద్రత, రోడ్డు ప్రమాదాల నియంత్రణకు సమగ్ర కార్యాచరణ -మైక్రో లెవెల్‌లో సమస్యలను గుర్తించి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *