-వైఎస్సార్ ఆసరా మూడో విడత సంబరాలలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అక్కచెల్లెమ్మల ఆర్థిక వికాసం, పేదరిక నిర్మూలనే లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తోందని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. సత్యనారాయణపురంలోని ఆంధ్రరత్న పార్కు వద్ద శుక్రవారం జరిగిన వైఎస్సార్ ఆసరా మూడో విడత సంబరాలలో డిప్యూటీ మేయర్ అవుతు శైలజారెడ్డి, స్థానిక కార్పొరేటర్ శర్వాణీ మూర్తితో కలిసి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో మహిళలు పెద్దఎత్తున పాల్గొని తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. అనంతరం మల్లాది విష్ణు మాట్లాడుతూ.. కుటుంబంలో మహిళ సంతోషంగా ఉంటేనే అందరూ సంతోషంగా ఉంటారని చెప్పారు. చిరు వ్యాపారాలతో, అత్యంత స్వల్ప మొత్తాలతో వారు కుటుంబాన్ని నడిపించే తీరు అద్భుతమని కొనియాడారు. అటువంటి అక్కచెల్లెమ్మలకు తోడ్పాటును అందిస్తూ.. వైఎస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు రూ.2.25 లక్షల కోట్ల విలువైన సంక్షేమాన్ని మహిళలకు అందించిందని తెలిపారు. అక్కచెల్లెమ్మలకు ఈ స్థాయిలో గతంలో ఏ ప్రభుత్వం కూడా లబ్ధి చేకూర్చలేదని చెప్పారు. 2014 లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు డ్వాక్రా రుణమాఫీ చేయకుండా మోసం చేయడంతో.. ఏ గ్రేడ్ గ్రూపులన్నీ ఆర్థిక క్రమశిక్షణ కోల్పోయి డి గ్రేడ్ లోకి పడిపోయాయని గుర్తుచేశారు. కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒకే ఒక్క నిర్ణయంతో 78 లక్షల మంది ఆడపడుచులకు నాలుగు విడతలలో రూ. 26 వేల కోట్ల ఆర్థిక లబ్ధి చేకూరుతున్నట్లు మల్లాది విష్ణు తెలియజేశారు. నియోజకవర్గంలో ఇప్పటివరకు వైఎస్సార్ ఆసరా ద్వారా మొత్తం రూ. 90 కోట్ల మేర లబ్ధి చేకూర్చినట్లు పేర్కొన్నారు. మూడో విడత ఆసరా ద్వారా డివిజన్ లోని 69 గ్రూపులలో రూ. 68 లక్షల 91 వేల 188 రూపాయల నిధులు జమ చేసినట్లు మల్లాది విష్ణు తెలిపారు. వీటిలో రూ. 2 లక్షలు అంతకన్నా ఎక్కువ రుణమాఫీ జరిగిన గ్రూపులు తొమ్మిది ఉన్నట్లు పేర్కొన్నారు. అత్యధికంగా నకదుర్గ పొదుపు సంఘం ఖాతాలో రూ. 2 లక్షల 42 వేల 892 రూపాయలు జమ అయినట్లు వెల్లడించారు. ఈ నగదును జీవనోపాధులైన రిటైల్ అమ్మకాలు, పాడి పరిశ్రమ, ఇతర ఉత్పత్తుల ద్వారా నెలనెలా ఆదాయం పొందేలా డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం సహకరించనున్నట్లు తెలిపారు. ఇందుకోసం అమూల్, హిందుస్థాన్ యూనిలీవర్, ప్రోక్టర్ అండ్ గ్యాంబల్ వంటి మల్టీ నేషనల్ కంపెనీలతో ఒప్పందం చేసుకున్నట్లు వెల్లడించారు. అలాగే డివిజన్లో 1,200 మంది పేదలకు ఇళ్ల పట్టాలు మంజూరు చేసిన ఘనత ఒక్క వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని మల్లాది విష్ణు తెలిపారు.
డిప్యూటీ మేయర్ అవుతు శైలజారెడ్డి మాట్లాడుతూ.. పేదవాడికి చేయూతనిచ్చే నవరత్న పథకాలను సృష్టించి, వారి జీవన చిత్రాన్ని మార్చిన ఘనత ఒక్క జగనన్నకే దక్కుతుందని తెలిపారు. మహిళల ఖాతాల్లో నగదు వేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అందరూ మెచ్చుకుంటుంటే, ప్రతిపక్ష నేతలు మాత్రం శాపనార్థాలు పెడుతున్నారని మండిపడ్డారు. లబ్ధిదారు ఉమా మాట్లాడుతూ.. ఆసరా పథకంతో పొదుపు మహిళలకు ఎంతగానో ఆర్థిక చేయూత లభించిందిందన్నారు. ఇప్పటివరకు మూడు విడతల సాయం అందినట్లు తెలిపారు. అలాగే అర్హత ఉన్న అన్ని పథకాలు తమకు వర్తించాయని.. ఇంటి పట్టా కూడా మంజూరైనట్లు వివరించారు. తన కుటుంబానికి వెన్నుదన్నుగా నిలిచిన జగనన్నకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో జోనల్ కమిషనర్ సృజనా, సీడీఓ జగదీశ్వరి, నాయకులు మైలవరపు రాము, లంకా బాబు, కమ్మిలి రత్న, కొల్లూరు రామకృష్ణ, చల్లాప్రగఢ గోపాలకృష్ణ, పెద్దిభొట్ల భాస్కర్, వెంకటేశ్వరరెడ్డి, సుబ్బారెడ్డి, చాంద్ శర్మ, కూనపులి ఫణి, పొదుపు సంఘాల మహిళలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News