Breaking News

పల్సర్‌ ఎన్‌ఎస్‌ 160 / ఎన్‌ఎస్‌ 200 సీసీ లో అధునాతన వెర్షన్‌…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
బజాజ్‌ ఆటో, పల్సర్‌ ఎన్‌ఎస్‌ 160/ఎన్‌ఎస్‌ 200 సీసీలో అధునాతన వెర్షన్‌ను ఈరోజు వరుణ్‌ బజాజ్‌, విజయవాడ షోరూం నందు వినియోగ దారులకు అందించడం జరిగినది. ఈ సందర్భంగా పి.వి.సత్యనారాయణ, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌, వరుణ్‌ బజాజ్‌ మాట్లాడుతూ, పూర్తి సరికొత్త పల్సర్‌ ఎన్‌ఎస్‌ 160 మరియు ఎన్‌ఎస్‌ 200ను ఆధునిక, డ్యూయల్‌ ఛానెల్‌ ఎబిఎస్‌ మరియు యుఎస్‌డి (అప్‌సైడ్‌ డౌన్‌ ఫోర్క్స్‌) మరింత సౌకర్యవంతమైన రైడ్‌ కొరకు, స్పోర్ట్‌ డిజైన్‌తో తీర్చిదిద్దడంతో పాటుగా అత్యున్నత పని తీరు మరియు నైపుణ్యంతో ఈ కొత్త పల్సర్‌ ఎన్‌ఎస్‌ 160/ఎన్‌ఎస్‌ 200 బైక్‌లను చేస్తున్నామని తెలిపారు. ఈ పల్సర్‌ ఎన్‌ఎస్‌ 160 డ్యూయల్‌ ఛానెల్‌ ఎబిఎస్‌లో శక్తివంతమైన 160.37 సీసీ ఇంజిన్‌, 4-స్ట్రోక్‌, 2-వాల్వ్‌, 2`స్పార్క్‌ ప్లగ్స్‌, ఆయిల్‌ కూల్డ్‌ ఇంజిన్‌తో రూపొందించారు. 17 హార్స్‌పవర్‌, 14.6 ఎస్‌.ఎం టార్క్‌ అందించగల, 5 స్పీడ్‌ గేర్‌ బాక్స్‌, మోనోపాక్‌ సస్పెన్షన్‌, డిటిఇ(డిస్టెన్స్‌ టూ ఎమ్టీ) గేర్‌ ఇండికేటర్‌ ఇందులో ఉన్నాయి. ఈ వాహనము ఎక్స్‌షోరూమ్‌ ధర రూ.1,34,803గా నిర్ణయించారు, ఎన్‌ఎస్‌ 200 డ్యూయల్‌ ఛానెల్‌ ఎబిఎస్‌లో శక్తివంతమైన 199.4 సీసీ ఇంజిన్‌, 4`స్ట్రోక్‌, 2`వాల్వ్‌, 3 స్పార్క్‌ ప్లగ్స్‌, లిక్విడ్‌ కూల్డ్‌ ఇంజిన్‌తో రూపొందించారు. 24.5 హార్స్‌పవర్‌, 18.74 ఎన్‌.ఎం టార్క్‌ అందించగల, 6 స్పీడ్‌ గేర్‌బాక్స్‌, మోనోషాక్‌ సస్పెన్షన్‌, డిటిఇ (డిస్టెన్స్‌ టూ ఎమ్టీ) గేర్‌ ఇండికేటర్‌ ఇందులో ఉన్నాయి. ఈ వాహనము ఎక్స్‌ షోరూమ్‌ ధర రూ.1,46,637గా నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో బజాజ్‌ ఆటో ఏరియా సేల్స్‌ మేనేజర్‌ మొహమ్మద్‌ సదత్‌ బాషా మరియు వరుణ్‌ బజాజ్‌ సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *