Breaking News

మహిళల ఆర్థిక స్వావలంబనకు వైఎస్సార్ ఆసరా దోహ‌దం

– రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలోని ప్రతి అక్కచెల్లెమ్మ ముఖంలో ఆనందం వెల్లివిరిస్తోందని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. దేవీనగర్లో శనివారం జరిగిన వైఎస్సార్ ఆసరా మూడో విడత సంబరాలలో డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, స్థానిక కార్పొరేటర్ జానారెడ్డితో కలిసి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం మల్లాది విష్ణు మాట్లాడుతూ.. పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలు లక్షాధికారులు కావాలనే మంచి ఆలోచనతో వైఎస్సార్ ఆసరా పథకాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్నారన్నారు. డ్వాక్రా రుణాల మాఫీ పేరుతో గత చంద్రబాబు సర్కారు మోసగించడంతో రుణభారం ఎక్కువై అక్కచెల్లెమ్మలు దయనీయమైన పరిస్థితుల్లో కూరుకుపోయారన్నారు. మహిళా సంఘాలు ఛిన్నాభిన్నమై ‘ఏ’ గ్రేడ్‌లోని సంఘాలు ‘సి’, ‘డి’ గ్రేడ్‌లోకి పడిపోయాయని గుర్తుచేశారు. కానీ అక్కచెల్లెమ్మలను సొంత కాళ్లపై నిలదొక్కుకునేలా ఈ ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నట్లు మల్లాది విష్ణు తెలిపారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని అక్షరాలా పాటిస్తూ ఆసరా మొదటి విడత ద్వారా రూ.6,318.76 కోట్లు చెల్లించినట్లు పేర్కొన్నారు. తద్వారా 78.76 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు లబ్ధి చేకూరిందన్నారు. రెండో విడతగా 78.76 లక్షల మందికి మరో రూ.6,439.52 కోట్లు చెల్లించగా.. మూడో విడతగా ఇప్పుడు మరో రూ.6,419.89 కోట్లు అందజేసినట్లు తెలియజేశారు. మొత్తంగా మూడు విడతలలో రూ.19,178.17 కోట్ల మేర 78.94 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు ప్రయోజనం చేకూరిందన్నారు. మూడో విడత ఆసరా ద్వారా 30 డివిజన్ లోని 213 గ్రూపులలో రూ. 2 కోట్ల 2 లక్షల 10 వేల 141 రూపాయల నిధులు జమ చేసినట్లు మల్లాది విష్ణు చెప్పారు. అత్యధికంగా సుభానల్లా పొదుపు సంఘానికి రూ. 2 లక్షల 40 వేల 767 రూపాయలు రుణమాఫీ జరిగినట్లు పేర్కొన్నారు. ఈ సాయం ఆడపడుచుల జీవితాల్లో మరిన్ని కాంతులు తీసుకురావాలని.. సుస్థిర ఆదాయం, వ్యాపారం, జీవనోపాధి అవకాశాలు మెరుగుపరచుకునేందుకు ఈ డబ్బును వినియోగించుకుని ఆర్థికంగా ఎదగాలని సూచించారు. అలాగే డివిజన్లో 2,433 మంది అక్కచెల్లెమ్మలకు ఇంటి పట్టాలు, 682 మందికి చేయూత, 1,685 మందికి అమ్మఒడి అందించినట్లు వెల్లడించారు. ప్రభుత్వం చేపట్టే అన్ని కార్యక్రమాలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుంటూ కుటుంబ ఆదాయాలను పెంచుకుని మహిళలందరూ ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు.

లబ్ధిదారు సయ్యద్ మోతిమా మాట్లాడుతూ.. మూడు విడతలుగా జగనన్న అందించిన ఆసరా సాయం మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ఎంతగానో దోహదపడిందన్నారు. సుల్తానా పొదుపు సంఘం ద్వారా తమ 10 మంది గ్రూపు సభ్యులు పచ్చళ్ల వ్యాపారం, కిరాణా, వస్త్ర వ్యాపారాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలాగే తమ కుటుంబానికి అమ్మఒడి, జగనన్న ఇంటి స్థలం వచ్చినట్లు చెప్పారు. మహిళ సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న సీఎం జగనన్నకు దేవుని చల్లని దీవెనలు ఎల్లవేళలా లభించాలని ప్రార్థించారు.

మరో లబ్ధిదారు సీహెచ్ విశాలాక్షి మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా అక్కచెల్లెమ్మలంతా సంతోషంగా ఉన్నారంటే అందుకు సీఎం వైఎస్ జగన్‌ ప్రజారంజక పాలనే కారణమన్నారు. వైఎస్సార్ ఆసరా మూడో విడత ద్వారా తమ కస్తూరిబాయి పొదుపు సంఘం ఖాతాలో రూ. లక్షా 89 వేల 555 రూపాయలు జమ అయినట్లు తెలిపారు. తనకు అమ్మఒడి, జగనన్న చేదోడు, ఆసరా పథకాలు అందినట్లు చెప్పుకొచ్చారు. సీఎం జగనన్న ప్రభుత్వం చేస్తున్న మేలుకు జీవితాంతం రుణపడి ఉంటామని ఈ సందర్భంగా తెలియజేశారు. కార్యక్రమంలో జోనల్ కమిషనర్ సృజనా, సీడీఓ జగదీశ్వరి, నాయకులు తుంపాల వరప్రసాద్, గోపిశెట్టి శ్రీను, సామంతకూరి దుర్గారావు, ముద్రబోయిన దుర్గారావు, మార్తి చంద్రమౌళి, శ్రీనివాసరెడ్డి, పవన్ రెడ్డి, రమేష్, నారాయణరెడ్డి, శివవర్మ, పొదుపు సంఘాల మహిళలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *