Breaking News

అరుదైన 12 కాలేయ మార్పిడి ఆపరేషన్లు విజయవంతంగా నిర్వహించిన మణిపాల్ హాస్పిటల్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మణిపాల్ హాస్పిటల్ సౌత్ ఏషియన్ లివర్ ఇనిస్టిట్యూట్ భాగస్వామ్యంతో కాలేయ మార్పిడి ఆపరేషన్లు విజయవంతంగా నిర్వహించిన సందర్భంగా శనివారం నగరంలో ఒక ప్రైవేటు హోటల్లో విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మణిపాల్ హాస్పిటల్ విజయవాడ డైరెక్టర్ డాక్టర్ సుధాకర్ కంటిపూడి మాట్లాడుతూ మణిపాల్ హాస్పిటల్ విజయవాడలో కాలేయ చికిత్సకు సంబంధించి కావలసిన వైద్య సదుపాయాలు అన్నీ పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నాయని వైద్య నిపుణులు, పారామెడిక్స్ టీం లు 24 గంటలూ అందుబాటులో ఉన్నారని, భారతదేశంలో సుమారు 50వేల మంది కాలేయ మార్పిడి కోసం ఎదురుచూస్తున్నారు కేవలం 25 కాలేయ మార్పిడి కేంద్రాలు మాత్రమే ఉన్నాయి. ఇవి సంవత్సరానికి 800 నుండి 1,000  మార్పిడిని నిర్వహిస్తున్నాయి మణిపాల్ లో అందుబాటులోకి వచ్చిన అధునాతన సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ ఆపరేషన్లకు 30 లక్షల వరకు ఖర్చు అవుతుందని ప్రభుత్వం సి.ఎం.ఆర్.ఎఫ్ కింద పది లక్షల వరకు సాయం అందిస్తుందన్నారు. 12 మందికి విజయవంతంగా కాలేయ మార్పిడి చికిత్స చేశామని అన్నారు.

ప్రొఫెసర్ డాక్టర్ టామ్ చెరియన్ మాట్లాడుతూ మణిపాల్ హాస్పిటల్ లో అత్యంత క్లిష్టమయిన కాలేయ శస్త్రచికిత్సలను  పూర్తి చేశాం. ముఖ్యంగా మరణాంతర కాలేయ మార్పిడి, కాలేయ దాతల ద్వారా చేసే మార్పిడి క్యాన్సర్లకు లివర్ రెసెక్షన్లు, పోర్టల్ వెయిన్ థ్రాంబోసిస్ కోసం మార్పిడి. చిన్న వయసు వారిలో కాలేయ మార్పిడి నిర్వహించామన్నారు. కాలేయ వ్యాధి నాణ్యమైన చికిత్సకు సరైన నిపుణుల బృందం మౌలిక సదుపాయాలు అవసరం కాలేయ మార్పిడి అనేది సంక్లిష్టమైన డిమాండ్ ఉన్న శస్త్రచికిత్స ఇప్పటి వరకు కాలేయ మార్పిడి శస్త్రచికిత్స కోసం రోగులు ఇతర రాష్ట్రాల వైపు చూసే వారు కీలకమైన కాలేయ శస్త్ర చికిత్సలు మణిపాల్ హాస్పిటల్- సౌత్ ఏషియన్ భాగస్వామ్యంలో ఇక్కడే చేస్తున్నాం లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ పై ప్రజల్లో ఉన్న వివిధ అపోహలు కూడా తొలగించుకోవాలి. చివరి దశకు చేరుకున్న వారికి కూడా అధునాతన కాలేయ మార్పిడి పద్ధతుల ద్వారా అద్భుతమయిన చికిత్సలు అందుబాటులోకి వచ్చాయన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ ఉత్తమ్‌ శర్మ, ఇతర విభాగాల డాక్టర్స్‌, హాస్పిటల్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *