-ఏప్రిల్ 14 – ముఖ్యమంత్రి పర్యటన పూర్తి స్థాయి లో విజయవంతం చేయాలి
-అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు
-జిల్లా ఇంఛార్జి మంత్రి వేణుగోపాల కృష్ణ
-హోం మంత్రి తానేటి వనిత
కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అంబేద్కర్ జయంతి సందర్బంగా ఈ నెల 14 వ తేదీ తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు పట్టణంలో పర్యటించనున్న నేపథ్యంలో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా ఇంఛార్జి మంత్రి చెల్లు బోయిన శ్రీనివాస్ వేణుగోపాల కృష్ణ, హోం మంత్రి తానేటి వనిత లు పేర్కొన్నారు.
ఏప్రిల్ 14 వ తేదీ కొవ్వూరు లో సీఎం పర్యటించనున్న నేపధ్యంలో ఆదివారం రాష్ట్ర హోం శాఖ మంత్రి తానేటి వనిత, జిల్లా ఇన్ఛార్జి మంత్రి వేణుగోపాలకృష్ణ, ఎంఎల్సీ సీయం కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురామ్ , జిల్లా కలెక్టరు డా. కె. మాధవీలత, ఎస్పీ సుధీర్ కుమార్, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు సిఎం పర్యటన హెలీప్యాడ్, సభావేధిక స్థల ఎంపిక పరిశీలన చేశారు. ఈ సందర్బంగా జిల్లా ఇంఛార్జి మంత్రి వేణుగోపాల్ మాట్లాడుతూ గోష్పాదాల రేవు ప్రాంతం, సత్యవతి నగర్, బుద్దుడు జంక్షన్, యువరాజ్ హోటల్ సెంటర్ ప్రదేశాలను పరిశీలించామన్నారు. సిఎం కార్యక్రమానికి అనువుగా ఉన్న హెలీప్యాడ్ స్థలాన్ని బుద్దుడు జంక్షన్ వద్ద, సభావేదికను సత్యవతి నగర్ హోం మంత్రి క్యాంపు కార్యాలయం దగ్గరలో ఎంపిక చేయడం జరిగిందని ఆయన తెలిపారు.
అనంతరం ప్రజాప్రతినిధులు, అధికారులతో స్థానిక మున్సిపల్ కార్యాలయ సమావేశం మందిరంలో సీయం పర్యటన ముందస్తు ఏర్పాట్ల పై హోం మంత్రి తానేటి వనిత దిశా నిర్దేశం చేస్తూ ఏప్రిల్ 14 న “వాలంటీర్ వందనం” గ్రామ, వార్డ్ సచివాలయ వాలంటీర్ లకు సేవా పురస్కార అవార్డుల రాష్ట్ర స్థాయి కార్యక్రమం కొవ్వూరు పట్టణంలో నిర్వహించనున్న నేపథ్యంలో అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలన్నారు. ఎటువంటి సంఘటనలు జరగకుండా అధికారులు ముందస్తు కార్యాచరణ ప్రణాళికతో సమన్వయం చేసుకుంటూ విధులు నిర్వహించాలన్నారు.
సిఎం కార్యక్రమాల సమన్వయకర్త, ఎం ఎల్ సి తలశిల రఘురాం మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి అధికారులకు, ప్రజాప్రతినిధులకు దిశా నిర్థేశం చేశామన్నారు.
అనంతరం కకలెక్టర్ కె. మాధవీలత మాట్లాడుతూ ఏప్రిల్ 14 న భారతరత్న డా బి ఆర్ అంబేద్కర్ పుట్టిన రోజును పురస్కరించుకుని సచివాలయ సిబ్బందికి అవార్డ్ లు, నగదు పురస్కారం రాష్ట్ర స్థాయి కార్యక్రమానికి జిల్లా వేదిక కానుందన్నారు. కొవ్వూరులో ఏర్పాటు చేసిన వేడుకలకు సమయం తక్కువుగా ఉన్నందున అధికారులు వారికి కేటాయించిన విధులను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. జిల్లాలోని 512 సచివాలయాల నుంచి సుమారు 18 వేల మంది వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది ఈ వేడుకలకు రానున్నారన్నారు. సభా వేధిక వద్ద 24 గ్యాలరీలు ఏర్పాటు చేయాలన్నారు. ముఖ్యమంత్రి పర్యటనలో హెలీప్యాడ్ నుండి సభా వేధిక వరకు రోడ్ షో కు సంబందిత ఏర్పాట్లు ఆర్ ఎం సి మున్సిపల్ కమీషనర్ దినేష్ కుమార్ పర్యవేక్షించాలని ఆదేశించారు. గ్యాలరీలకు సంబందించి వాటర్ ప్యాకెట్స్, అల్పాహారం, మెడికల్ క్యాంపులు ద్వార ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లు సిద్దం చేసుకోవాలన్నారు. బహిరంగ సభకు వొచ్చే ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడకుండా కార్యాచరణ ప్రణాళిక ఖచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు.
ఎస్పీ సిహెచ్. సుధీర్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ సిఎం పర్యటనకు సంబందించిన హెలీప్యాడ్, రోడ్ షో, సభావేదిక వద్ద కట్టు దిట్టమైన భద్రతా ఏర్పాట్లు, పోలీసు బందోబస్తు తో పాటు ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా పటిష్టమైన ఏర్పాట్లు నిర్వహిస్తామన్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే బస్సులకు పార్కింగ్ సౌకర్యం కోసం స్థలాలు గుర్తిస్తున్నాట్లు తెలిపారు
జేసీ ఎన్. తేజ్ భరత్ మాట్లాడుతూ కార్యక్రమానికి సంబందించి ప్రజలను తీసుకువచ్చేందుకు గాను 550 ప్రవేట్, 400 ఆర్టీసీ బస్సులను ఆయా రూట్స్ వారీ సిద్దం చేస్తామన్నారు.
మున్సిపల్ కమీషనర్ దినేష్ కుమార్ మాట్లాడుతూ సిఎం రోడ్ షోకు సంబందించి బారిగేడ్స్ ఏర్పాటు, ప్రజలకు తాగునీరు, అల్పాహారం అందిస్తామని, సభావేధిక వద్ద ప్రతి గ్యాలరీలో మెడికల్ కిట్స్, ఓఆర్ఎస్ ప్యాకేట్స్ అందిస్తామన్నారు.
కార్యక్రమంలో యంపి మార్గాని భరత్ రామ్, ఏలూరు రెంజ్ డిఐజీ పాల్ రాజు, జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్, డి ఆర్వో జీ. నరసింహులు, గోపాలపురం, రాజానగరం శాసనసభ్యులు తలారి వెంకట్రావు, జక్కంపూడి రాజా, రూరల్ కోఆర్డీనేటర్ చందన్ నాగేశ్వరరావు, స్థానిక నాయకులు ఎస్.రాజీవ్ కృష్ణ, మాజీ ఎంఎల్ సీ కొడూరు శివరామకృష్ణ, ఆర్డీవోలు ఎస్. మల్లిబాబు, ఏ. చైత్ర వర్షిణి, డీసీహెచ్ ఓ డా. సనత్ కుమారి, డీపీవో పి. జగదాంబ, డీఆర్డీఏ పీడీ సుభాషిని, డిఎల్డీవో వీణాదేవి, పీడీ డ్వామా జిఎస్. రామగోపాల్, ఆర్డబ్ల్యూఎస్. ఎస్ఈ భాలశంకర్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు జీ ఎస్ రామ గోపాల్, పి. జగదంబ, డిఎల్డీవో తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News