విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు సమ ప్రాధాన్యత ఇస్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్టు ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. సోమవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 5వ డివిజన్ 15వ సచివాలయ పరిధిలోని గంగిరెద్దుల దిబ్బ గంగానమ్మ గుడి నుండి మొదలై మైత్రి నగర్ కొండ,విజయనగర్ కాలనీ ప్రాంతాలలో నాయకులు, అధికారులు, వలంటీర్ లతో కలిసి ఇంటింటికి వెళ్లిన అవినాష్ ప్రభుత్వం ద్వారా వారి కుటుంబాలకు అందుతున్న సంక్షేమ లబ్ది వివరాల కరపత్రాన్ని అందజేసి ఆ ప్రాంతంలో చేసిన అభివృద్ధి గురుంచి వివరించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ నేడు వైసీపీ నాయకులు తమ ముంగిటకు వస్తుంటే కొండ ప్రాంతంలో నివసించే ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ మాకు సాదర స్వాగతం పలుకుతున్నారు అని అన్నారు. నాడు స్వర్గీయ దేవినేని నెహ్రూ ఎమ్మెల్యే గా ఉన్నప్పుడు మా కష్టాలు తెలుసుకొని కొండ ప్రాంతంలో మెట్ల మార్గాలు, విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. కానీ తరువాత వచ్చిన టీడీపీ ఎమ్మెల్యే అసలు ఇంతవరకు కొండ ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని,అసలు ఇక్కడ ప్రజల గురుంచి పట్టించుకోలేదని విమర్శించారు. కానీ జగనన్న ప్రభుత్వం లో ప్రవేశపెట్టిన వలంటీర్ వ్యవస్థ ద్వారా కొండంచున ఉన్న చివరి ఇంటి వరకు కూడా అర్హతే ప్రామాణికంగా నేరుగా మా గడప వద్దకే పెన్షన్లు, సంక్షేమ పథకాలు అందిస్తున్నారని ప్రజలు తమ ఆనందాన్ని పంచుకొంటూన్నారని అన్నారు. అదేవిధంగా ఈ ప్రాంతంలో కోటి రూపాయలతో కమ్యూనిటీ హల్ నిర్మాణం గాని, మంచినీటి కష్టాలు తొలగేలా వాటర్ ట్యాంక్ మంజూరు గాని, ప్రజల ఆరోగ్యనికి పెద్దపీట వేస్తూ అర్బన్ హెల్త్ సెంటర్ ఏర్పాటు గాని వైసీపీ ప్రభుత్వ ఘనతే అని అవినాష్ తెలిపారు. పార్టీ పిలుపు మేరకు చేపట్టిన జగనన్నే మన భవిష్యత్ కార్యక్రమానికి నియోజకవర్గంలో ప్రజల వద్ద నుండి అనూహ్య స్పందన లభిస్తుంది అని, రాబోయే రోజుల్లో తూర్పు నియోజకవర్గంలో భారీ మెజారిటీతో వైసీపీ జెండా ఎగురడం ఖాయమని అవినాష్ ధీమా వ్యక్తంచేశారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ,5వ డివిజన్ కార్పొరేటర్ కలపాల అంబెడ్కర్ వైస్సార్సీపీ నాయకులు మట్ట ప్రసాద్,లోకేష్,వల్లెపు నాగేశ్వర రావు,రాము,రాజు,నటరాజ్,సత్యం తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News