-ఈఆర్వోలను ఆదేశించిన కలెక్టర్
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాష ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల ఎల క్టోరల్ రోల్ అధికారులను (ఈఆర్వోలను) ఆదేశించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల అధికారి ఎంకే మీనా గురువారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఓటర్ల జాబితాలలో మార్పులు చేర్పులు, ఓటర్లకు ఫోటో గుర్తింపు కార్డులు ముద్రణ, పంపిణీ, ఎన్నికల పిటిషన్ల పరిష్కారం, ఓటర్ల జాబితాలపై క్లైములు అభ్యంతరాలు వాటి పరిష్కారం తదితర అంశాలపై సమీక్షించారు. జిల్లా కలెక్టర్ బంగ్లా నుండి వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు జిల్లాలో 2023 ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం తుది జాబితా ప్రకారం 14,61,634 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. జిల్లాలో కొత్తగా నమోదైన ఓటర్లకు సంబంధించి 38 వేల ఫోటో గుర్తింపు కార్డులు ముద్రించి పంపిణీ గావించినట్లు తెలిపారు. జిల్లాలో ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులకు సంబంధించి, ఓటర్ల జాబితాలలో క్రైములు, అభ్యంతరాలు సంబంధించి ఫారం 6 జిల్లాలో 15,620 వచ్చాయని వాటిలో 10680 పరిష్కరించినట్లు, ఫారం-7 19,170 వచ్చాయని వాటిలో 17,143 పరిష్కరించినట్లు, ఫారం-8 8,474 వచ్చాయని వాటిలో 5,766 పరిష్కరించినట్లు తెలిపారు. పెండింగ్ క్లైములు సత్వరమే పరిష్కరించాలన్నారు. బిఎల్ఓ లందరూ నిర్దేశించిన 1 నుండి 7 వరకు రిజిస్టర్లు నిర్వహించేలా చూడాలని కలెక్టర్ సూచించారు. వీడియో కాన్ఫరెన్స్లో జాయింట్ కలెక్టర్ డాక్టర్ అపరాజిత సింగ్, డిఆర్ఓ. ఎం వెంకటేశ్వర్లు, వివిధ అసెంబ్లీ నియోజక వర్గాలకు ఈఆర్వో లుగా ఉన్న ఆర్డీవోలు పద్మావతి, ఐ కిషోర్, డీఎస్ఓ పార్వతి, ముడ విసి రాజ్యలక్ష్మి, కలెక్టరేట్ కోఆర్డినేషన్ విభాగం సూపర్నెంట్ హరినాథ్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News