విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వేసవి ఆట విడుపు కోసం నగరంలోని బందర్‌రోడ్‌లో వజ్రా గ్రౌండ్స్ నందు రోబోటిక్ సూపర్ హీరోస్ ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఆదివారం నగరంలోని వజ్ర గ్రౌండ్స్‌నందు రోబోటిక్ సెట్టింగ్‌లతో ఏర్పాటుచేసిన ఎగ్జిబిషన్‌ను తూర్పు నియోజకవర్గం వైసిపి ఇంచార్జి దేవినేని అవినాష్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ రోబోటిక్ హీరోస్ ఆకృతులలో వీక్షకుల కంటికి ఇంపుగా ఏర్పాటు చేయడం అభినందనీయమని, ఈ అవకాశాన్ని నగరవాసులు సద్వినియోగపరచుకోవాలని ఆయన కోరారు. రోబోటిక్ సెట్టింగ్లను ఆయన పరిశీలించి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రోబోటిక్ సూపర్ హీరోస్ ఎగ్జిబిషన్‌ను రోబోటిక్ సెట్టింగ్‌లతో నగరంలోనే ప్రారంభించారని తెలియజేశారు. ఈ రోబోటిక్ ఎగ్జిబిషన్ వేసవి విడిదిగా ప్రేక్షకులను అలరిస్తుందన్నారు. రోబోటిక్ సూపర్ హీరోస్ ఆకృతులు ఎగ్జిబిషన్ లో ప్రత్యేకంగా ఆకర్షిస్తాయని వీక్షకులకు ఎంతో ఆనందాన్ని ఇస్తాయని వెల్లడిరచారు.
నిర్వాహకులు మాట్లాడుతూ కిరణ్, గోపి మాట్లాడుతూ రోబోటిక్ సెట్టింగ్ విజయవాడ వాసులను ఎంతగానో అలరిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. వేసవిలో నగరవాసుల కోసం ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశామన్నారు. సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, ఐరన్ మ్యాన్, అక్వా మ్యాన్ జంగిల్ మ్యాన్, హీమ్యాన్, బ్యాట్ మెన్, వకాండ లేడీ, ట్రాన్సఫార్మర్స్, పవర్ రెంజర్స్, హల్క్ డాక్టర్ స్ట్రెంజ్, కెప్టెన్ అమెరికా బొమ్మలు పిల్లలని ఎంతగానో అలరించనున్నా యని పేర్కొన్నారు. ఎగ్జిబిషన్లోని సెట్టింగులు చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఎంతగానో ఆకట్టుకోవడంతోపాటు ఆశ్చర్యచకితులను చేస్తాయని ఆయన పేర్కొన్నారు. రోబోటిక్ ఎగ్జిబిషన్లో జెయింట్ వీల్, కొలంబస్, టోరాటోరా, బ్రేక్ డ్యాన్స్, చిన్న పిల్లల ఆటవస్తువులు ఈ ఎగ్జిబిషన్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ.. ఇటు చిన్నారులు, అటు పెద్దవారికి ఆహ్లాదంతో పాటూ ఆనందాన్ని పంచుతాయని ఆశాభావం వ్యక్తంచేశారు. కలకత్తా, జైపూర్, ఢల్లీి, మహారాష్ట్ర చేనేత కళాకారులు తయారు చేసిన ఉత్పత్తులను ఎగ్జిబిషన్లో ప్రదర్శించారని పేర్కొన్నారు. పాఠశాలలు కళాశాలలకు సెలవుల సందర్బంగా ఈ రోబోటిక్ ఎగ్జిబిషన్ నగరవాసులను ఎంతగానో అలరిస్తాయని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ రిహన నాహీద్, నిర్వాహకులు గోపి, భాను అడపా ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News