Breaking News

ఏపీసీసీ ప్రెసిడెంట్‌ గిడుగు రుద్రరాజును మర్యాదపుర్వకంగా కలసిన జమీల్‌ అహ్మద్‌ బేగ్‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ ఆంధ్రరత్న భవన్‌లో ఏపీసీసీ ప్రెసిడెంట్‌ గిడుగు రుద్రరాజును నేషనలిస్టు కాంగ్రెస్‌ పార్టీ మైనార్టీ విభాగం నేషనల్‌ వైస్‌ చైర్మన్‌ జమీల్‌ అహ్మద్‌ బేగ్‌ బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జమీల్‌ అహ్మద్‌ బేగ్‌ గిడుగు రుద్రరాజుతో సోమవారం విజయవాడ జింఖానా గ్రౌండ్‌లో జరిగిన సత్యాగ్రహ సభను గురించి, సభలో బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులను చర్చించినట్లు తెలిపారు. నేషనలిస్టు కాంగ్రెస్‌ పార్టీ కూడా బీజేపీ వ్యతిరేక పార్టీలతో కలసి పోరాటాలకు సిద్ధంగా ఉందని కేంద్రంలో బీజేపీకి తగిన గుణపాఠం చెప్పేలా బీజేపీ వ్యతిరేక పార్టీలు కలసి పోరాడుదామన్నారు. ఈ సందర్భంగా జమీల్‌ అహ్మద్‌ బేగ్‌ గిడుగు రుద్రరాజును శాలువాతో సత్కరించారు. గిడుగు రుద్రరాజు వెంట ఏపీసీసీ వైస్‌ చైర్మన్‌ ధనేకుల మురళి, ఏఐసీసీ మెంబర్‌ మీసాల రాజేశ్వరరావులు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *