Breaking News

ఆంధ్రప్రదేశ్ సీనియర్ డాన్స్ మాస్టర్స్ ఐక్యవేదిక సమావేశం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
డాన్స్ మాస్టర్లు ఎదుర్కొంటున్న అనేక రకాల సమస్యలు పరిష్కరించుకునేందుకు రాష్ట్రంలోని డాన్స్ కళాకారులందరూ ఏకతాటిపై నిలబడాలని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సీనియర్ డ్యాన్స్ మాస్టర్స్ ఐక్యవేదిక అధ్యక్షుడు బండి లక్ష్మీనారాయణ (గబ్బర్) పిలుపునిచ్చారు. ఆదివారం, గాంధీనగర్, ప్రెస్ క్లబ్ లో డాన్స్ మాస్టర్స్ ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని జిల్లాల డాన్స్ మాస్టర్ లను కలుపుకుని ఐక్యతగా తమ సమస్యలు పరిష్కరించుకునేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అని డాన్స్ మాస్టర్ లకు అన్నిచోట్ల అన్యాయం జరుగుతుందని తమ డాన్స్ వర్గానికి చెందిన వారే డాన్స్ మాస్టర్లు కాకపోయినా తాము సైతం డాన్స్ మాస్టర్లమేనంటూ తమ పేర్లు వాడుకుంటూ చెడ్డ పేరు తీసుకొస్తున్నారని అటువంటి వారిని ఐక్యవేదిక తీవ్రంగా ఖండిస్తుందని హెచ్చరించారు. తమ సమస్యలు పరిష్కరించుకునేందుకు ఐక్యవేదిక ఎంతగానో ఉపయోగపడుతుందని అన్ని జిల్లాల వారు ఐక్యతగా ఉంటూ ఒకే అసోసియేషన్ తరపు నుండి పోరాడినట్లయితే సమస్యలు పరిష్కరించుకోగలడం సులభతరం అవుతుందన్నారు. సీనియర్ డాన్సర్ రమేష్ మాట్లాడుతూ ప్రభుత్వం చొరవ చూపి డాన్స్ కళాకారులను ప్రోత్సహించాలని కోరారు. ప్రదర్శన నిమిత్తం ఇతర దేశాలకు, పక్క రాష్ట్రాలకు వెళ్లేటప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. ఇటువంటిపరిస్థితుల్లో ప్రభుత్వం చొరవ చూపి తమకంటూ ఒక జీవో మంజూరు చేసి డాన్స్ కళాకారులను ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో భాగంగా కొంతమంది సీనియర్ డాన్స్ కళాకారులు మాట్లాడుతూ తమలో ఐక్యత లోపించడం వల్ల మధ్యలో వచ్చిన డాన్స్ కళాకారులు కొంతమంది అవగాహన లోపంతో తమకు అన్ని తెలుసునని డాన్స్ మాస్టర్లు మంటూ ఇతరులకు అన్యాయం చేసే దిశగా అడుగులు వేస్తున్నారని, అటువంటి వారిని ఎదుర్కొని ఖండించేందుకు, వారిని సైతం మార్చి ఇటువంటి ఐక్యవేదిక ద్వారా అవగాహన కల్పించి కళాకారులందరిని ఏకతాటిపై ముందుకు తీసుకెళ్లేందుకు తమను తాము అభివృద్ధి పరుచుకునేందుకు ఇటువంటి ఐక్యవేదిక ఎంతగానో డాన్స్ కళాకారులకు ఉపయోగపడుతుందని సూచించారు. ఈ సమావేశంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల డాన్స్ కళాకారులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *