Breaking News

సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ కార్యాలయం, విజయవాడ సంయుక్త సంచాలకులు గా పి. రత్నాకర్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ 2002 బ్యాచ్‌కు చెందిన అధికారి, పి. రత్నాకర్, పదోన్నతిపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ కార్యాలయం, C.G.O. కాంప్లెక్స్, ఆటోనగర్, విజయవాడ నందు సంయుక్త సంచాలకులు గా ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. రత్నాకర్ రెండు దశాబ్దాల కాలంలో సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖలో వివిధ విభాగాల్లో అధికారిగా పనిచేశారు. పత్రికా సమాచార కార్యాలయం, హైదరాబాద్ లో అసిస్టెంట్‌ డైరెక్టర్, అలాగే డిప్యూటీ డైరెక్టర్ గా పనిచేసారు. దూరదర్శన్ న్యూస్, విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం అధిపతిగా సేవలందిస్తూ… పదోన్నతి బదిలీ పై విజయవాడలోని సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ప్రాంతీయ కార్యాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *