Breaking News

జగన్ పాలనలో దారుణం గా రైతుల పరిస్థితి

-తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శి ఏడుకొండలు విమర్శ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జగన్ పాలనలో అన్నదాతలైన రైతుల పరిస్థితి అధోగతి పాలైందని తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శి సాదరబోయిన ఏడుకొండలు ఘాటుగా విమర్శించారు. శనివారం తెలుగుదేశం పశ్చిమ కార్యాలయం (బుద్ధ వెంకన్న కార్యాలయం) లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మాది రైతుల ప్రభుత్వం అనే సొల్లు మాటలు చెప్పిన జగన్ రైతులు, అన్నదాతలు అకాల వర్షాలు ధాటికి నిండా మునిగిపోయినా జగన్ ఏ మాత్రం పట్టించుకోవడంలేదని విమర్శించారు. మొక్కజొన్న, పసుపు, అరటి, వరి వంటి అనేక పంటలు దారుణంగా దెబ్బతిన్నయని ఆవేదన వ్యక్తం చేశారు. దెబ్బతిన్నరైతులు వద్దకు చంద్రబాబు వెళ్లి ఓదార్చుతున్నారని, దాన్ని వైసీపి నాయకులు సహించలేకపోతున్నారని విమర్శించారు. జగన్ పెట్టిన రైతు భరోసా కేంద్రాలు రైతు భక్షణ కేంద్రాలుగా మారాయిని విమర్శించారు. వైయస్సార్ పార్టీకి ఎట్టి పరిస్థితుల్లో ఓట్లు వేయకూడదని రైతులు, ప్రజలు నిర్ణయించుకున్నారని ఆయన చెప్పారు. రానున్న 72 గంటల్లో రైతులకు న్యాయం చేయాలని ఏడుకొండలు డిమాండ్ చేశారు. తెలుగుదేశం నాయకులు గణపా రాము మాట్లాడుతూ ధరల స్థిరీకరణ నిధి అనేది ఏమైందని విమర్శించారు. జగన్ పాలన లో రైతుల కష్టాలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగాయని అన్నారు. జీవో 1 అమలును నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో తెలుగుదేశం నాయకులు బూదల నందకుమారి మాట్లాడుతూ జగన్ పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. ఈ సమావేశంలో తెలుగుదేశం నాయకులు ఈగల సాంబశివరావు,చిట్టి తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిన్నతనంలోనే కండరాల క్షీణత గుర్తింపుపై ప్రత్యేక దృష్టి: మంత్రి కందుల దుర్గేష్

-అమరావతి రేర్ డిసీజెస్ ఆర్గనైజేషన్ ఫౌండర్ శోభారాణి సుంకర సేవలు అభినందనీయమని కొనియాడిన మంత్రి దుర్గేష్ అమరావతి, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *