Breaking News

పాఠశాలలో ప్రారంభం లోపు నాడు- నేడు పనులు పూర్తి కావాలి

-జగనన్న విద్యా కానుక సామాగ్రి నాణ్యత ప్రమాణాల మేరకు ఉండేలా నాణ్యత ప్రమాణాల కమిటీలు తనిఖీ చేయాలి: జిల్లా కలెక్టర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
నాడు -నేడు కార్యక్రమంలో భాగంగా నిర్మితమవుతున్న పాఠశాల భవనాలు మరియు ఇతర మౌలిక సదుపాయాల ఏర్పాటు వేగవంతం చేసి పాఠశాలల పునః ప్రారంభం నాటికి పూర్తి స్థాయిలో ఉండేలా చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులను జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి ఆదేశించారు. శనివారం ఉదయం కలెక్టర్ నాడు- నేడు కార్యక్రమం కింద మంజూరైన పాఠశాలల నిర్మాణాలు మరియు మౌలిక సదుపాయాల కల్పన పై పాకాల మండలం ఓబులశెట్టి వారి పల్లిలో నిర్మితమవుతున్న ఉన్నత పాఠశాల భవనాల్ని పరిశీలించి పాఠశాలల పునః ప్రారంభ సమయంలోపు నిర్మాణ పనులు, మరమ్మత్తులు, మౌలిక సదుపాయాల కల్పన ఏర్పాటు పూర్తి కావాలని జిల్లా విద్యాశాఖ అధికారి వి.శేఖర్ మరియు సంబంధిత అధికారులను, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీని ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ నిర్మాణ పనులు, మౌలిక సదుపాయాలు ఏర్పాటు కావాలని అన్నారు. అనంతరం కలెక్టర్ తిరుపతి పట్టణంలోని శ్రీ పండిట్ జవహర్ లాల్ నెహ్రూ మున్సిపల్ ఉన్నత పాఠశాల నందు ఏర్పాటు చేసిన జగనన్న విద్యా కానుక మండల స్టాక్ పాయింట్ లో విద్యార్థులకు పంపిణీ కొరకు స్టాక్ పాయింట్ కు అందిన యూనిఫామ్ లు పుస్తకాలను తదితర సామాగ్రిని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జగనన్న విద్యా కానుకకు సంబంధించిన సామాగ్రి నాణ్యత ప్రమాణాల మేరకు ఉండాలని, ఎప్పటికప్పుడు వచ్చే స్టాక్ ను జిల్లాస్థాయి మండల స్థాయి కమిటీలు తనిఖీ చేసి నాణ్యమైన విద్యా కానుక కిట్లను పాఠశాలల ప్రారంభం నాటికి పిల్లలకు పూర్తి స్థాయిలో అందించేలా ఉండాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిఎల్డిఓ సుశీల దేవి, ప్లానింగ్ కోఆర్డినేటర్ ఎస్ ఎస్ ఏ రామచంద్రారెడ్డి తదితర విద్యాశాఖ సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

స్వల్ప వర్షానికే జలమయం.. డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా విఫలం

-​రాజారాజేశ్వరి పేట నుంచి బుడుమేరు వరకు నీట మునిగిన రోడ్ల పరిశీలన -​గత రెండేళ్లుగా నగరానికి ఒక్క రూపాయి నిధులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *