Breaking News

వైయస్సార్’ కళ్యాణమస్తు’ ‘షాది తోఫా’ పథకాల కింద ఆర్థిక సాయం పంపిణీ చేసిన మంత్రి జోగి

-నూతన దంపతులకు అభినందనలు తెలిపిన మంత్రి జగనన్న ఇచ్చిన కానుకను మీ పిల్లల భవిష్యత్తుకు వినియోగించాలని సూచన

పెడన, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ శనివారం పెడన మార్కెట్ యార్డు సమావేశ మందిరంలో పెడన నియోజకవర్గ పరిధిలో వైయస్సార్ కళ్యాణమస్తు షాది తోఫా పథకాల కింద 96 జం టలకు రు.67.15 లక్షల ఆర్థిక సహాయం చెక్కును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేద కుటుంబాలలో ఆడపిల్లల వివాహం భారం కాకూడదని జగనన్న కళ్యాణమస్తు షాదీ తోఫా పథకాలు ప్రవేశపెట్టి అందిస్తున్న ఆర్థిక సాయం జగనన్న కానుకగా మంత్రి అభివర్ణించారు.
ఈ ఆర్థిక సహాయాన్ని పుట్టబోవు చిన్నారుల పేరున ఫిక్స్ డ్ డిపాజిట్ వేయాలని, వారు పెరిగి యుక్త వయసు వచ్చేనాటికి 15 లక్షల వరకు పెద్ద మొత్తం అవుతుందని, వారి చదువులకు, భవిష్యత్తుకు వినియోగించుకోవాలని మంత్రి నూతన దంపతులకు సూచించారు. నూతన దంపతులు సంతోషంగా సుఖంగా ఉండాలని, జగనన్న ఆశీస్సులు మెండుగా ఉంటాయని, నా తరఫున, జగనన్న తరఫున దీవెనలు అంటూ అభినందనలు తెలిపారు. పేదల కోసం ఇంతగా సాయం అందిస్తున్న జగనన్నను మరువరాదని, పదిమందికి తెలియ చెప్పాలని మంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం లో వివిధ మండలాల ప్రజా ప్రతినిధులు, సర్పంచులు, మండల అధికారులు, నూతన వధూవరులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *