Breaking News

ఆర్జీదారుల నుండి స్వీకరించిన అర్జీలపై సంబంధిత అధికారులు సానుకూల దృక్పదంతో స్పందించి సమస్యలకు పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు అన్నారు.

ఆర్జీదారులపై సానుకూలంగా స్పందించి సమస్యలకు పరిష్కారం చూపండి.. స్పందనలో అధికంగా 120 ఆర్జీల నమోదు జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు.

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ ఎస్‌. డిల్లీరావు, జాయింట్‌ కలెక్టర్‌ డా. పి సంపత్‌ కుమార్‌, డిఆర్‌వో కె. మోహన్‌కుమార్‌లు ఆర్జీదారుల నుండి 120 వినతులను స్వీకరించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ స్పందనలో ఆర్జీదారుల నుంచి స్వీకరించిన ఆర్జీలకు శాశ్వత పరిష్కార మార్గం చూపించినప్పుడే ఆర్జీదారుడు సంతృప్తి చెందే అవకాశం ఉంటుందని అప్పుడే స్పందన లక్ష్యం నేరవేరుతుందన్నారు. సమస్యలపై సానుకూలంగా స్పందించిన్నప్పుడే పరిష్కారం మార్గం లభిస్తుందని అప్పుడే ఆర్జీదారుడు స్పందన పై పెట్టుకున్న నమ్మకం నేరవేరుతుందన్నారు. ఆర్జీదారుడు నుండి స్వీకరించిన ఆర్జీలకు సంబంధించి సమస్యను పూర్తిగా అర్థం చేసుకుని ఆర్జీదారుని సమక్షంలో సంబంధిత అధికారులతో నేరుగా సంప్రదించి సమస్యకు పరిష్కార మార్గాన్ని కనుగొని పరిష్కరించడం ద్వారా పారదర్శకంగా సమస్యకు శాశ్వత పరిష్కారం ఇవ్వాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని నేరవేర్చడంలో జిల్లా అధికారులు భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఉందన్నారు. సుదూర ప్రాంతాల నుండి వ్యయప్రయాసాలతో స్పందనలో సమస్య పరిష్కారం అవుతుందన్న ఆశతో వచ్చే ఆర్జీదారుడు సంతృప్తి చేందేలా ఓర్పుతో సమస్యను విని పరిష్కరించే మార్గాన్ని వివరించాలన్నారు. ఆర్జీలు ఏ స్థాయిలోను తిరిగి నమోదు కాకుడదన్నారు. గ్రామ వార్డు సచివాలయాలు, 1902 కాల్‌ సెంటర్‌, స్పందన మొబైల్‌ యాప్‌, వెబ్‌ అప్లికేషన్‌ ద్వారా నమోదయ్యే అర్జీల పరిష్కారంపై సంబంధిత శాఖల అధికారులు దృష్టి పెట్టాలని కలెక్టర్‌ డిల్లీరావు అధికారులకు సూచించారు.స్పందన కార్యక్రమంలో 120 అర్జీల నమోదు అయ్యాయి వీటిలో అత్యధికంగా రెవెన్యూ 37, పోలీస్‌ 21, యంఏయుడి 12, పంచాయతీరాజ్‌ 6, ఉపాధి కల్పన 4, సహాకార శాఖ 4, గృహ నిర్మాణం 3, ఏపిఆర్‌టిసి 3, బ్యాంకులకు సంబంధింన 3 అర్జీలు, హౌసింగ్‌ 3, సంఫీుక సంక్షేమం 2, విభిన్నప్రతిభావంతుల సంక్షేమం 2, గనులు 2, సిల్క్‌ డెవలప్‌మెంట్‌ 2, విద్యుత్‌ శాఖ 2, జలవనరులు 2, డ్వామా 2, హెల్త్‌ 1, మైనార్టీ 1, ఆర్‌అండ్‌ బి 1, ఆర్‌డబ్ల్యుఎస్‌ 1, బిసి వెల్ఫేర్‌ 1, సర్వే 1, అటవీ శాఖ 1, విద్య శాఖ 1, మత్స్య శాఖ 1, రిజిస్ట్రర్‌ అండ్‌ స్టామ్స్‌ 1, పౌర సరఫరాలు 1, ఆర్జీలు నమోదు అయ్యాయని జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు తెలిపారు.స్పందన కార్యక్రమంలో డిఆర్‌డిఏ పీిడికె.శ్రీనివాస్‌, డిఎస్‌వో పి కోమలి పద్మ, డ్వామ పిడి జె. సునీత, ఐసిడిఎస్‌ పీడి జి. ఉమాదేవి, డియంహెచ్‌వో డా. యం. సుహాసిని, హౌసింగ్‌ పిడి రజినీ కుమారి, పశుసంర్థక శాఖ జెడి కె. విద్యాసాగర్‌, జిల్లా సర్వే అధికారి కె. సూర్యారావు, డిసివో సిహెచ్‌ శైలజ, గ్రామ వార్డు సచివాలయ ప్రత్యేక అధికారి కె. అనురాధ, ఉద్యాన శాఖ జిల్లా అధికారి బాలాజీ కుమార్‌, వ్యవసాయ శాఖ జిల్లా అధికారి ఎస్‌ నాగమణమ్మ, మార్కెటింగ్‌ ఏడి కిశోర్‌, జిల్లా క్షయ వ్యాధి నివారణ సంస్థ అధికారి డా. ఉషారాణి, తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *