Breaking News

ప్రజల సమస్యల సత్వర పరిష్కారం కొరకే “జగనన్నకు చెబుదాం” కార్యక్రమం

-అర్జీదారుల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు:కలెక్టర్
-సామాన్య ప్రజల సమస్యల పరిష్కారం కోసమే 1902 హెల్ప్ లైన్ : జిల్లా ఎస్.పి

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
“జగనన్నకు చెబుదాం” అనే కార్యక్రమం దేశంలోనే ఎక్కడ లేని విధంగా వినూత్నమైన కార్యక్రమమని, ఫిర్యాదుల పరిష్కార హెల్ప్‌లైన్- 1902 ఈ టోల్- ఫ్రీ నంబర్‌ తో ప్రస్తుతం జరుగుతున్న స్పందన గ్రీవెన్స్ కు మరింత మెరుగులు దిద్ది ప్రజల సమస్యలకు నాణ్యమైన, సత్వర పరిష్కారం కొరకేనని జిల్లా కలెక్టర్ కె. వెంకట రమణా రెడ్డి అన్నారు. బుధవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ లో వర్చువల్ విధానంలో మండల స్థాయి డివిజన్ స్థాయి అధికారులతో జగనన్నకు చెబుదాం కార్యక్రమంపై జిల్లా కలెక్టర్ దిశానిర్దేశం చేసి ఆనంతరం మీడియాతో మాట్లాడుతూ జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని మంగళవారం నిన్నటిరోజున గౌ. ముఖ్యమంత్రి తాడేపల్లి సి.ఎం క్యాంపు కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జగనన్నకు చెబుదాం వెబ్సైట్, హెల్ప్ లైన్ నంబర్ 1902 ను లాంఛనంగా ప్రారంభించారని అన్నారు.

వివక్షలేని, అవినీతికి తావు లేకుండా, అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందించే దిశలో ప్రభుత్వం పని చేస్తోందని ముఖ్యమంత్రి స్థాయి నుండి గ్రామ సచివాలయం ఉద్యోగి వరకు ప్రజా సేవకులమని, ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించే దిశలో అర్జీదారుల సమస్యను స్పందన, 1902 హెల్ప్ లైన్ ద్వారా అందిన వెంటనే సంబంధిత అధికారికి సదరు అర్జీ పంపబడుతుంది అని, దానిని సదరు అధికారి ఓపెన్ చేసి అర్జీదారుని సంప్రదించి వారి సమస్యపై పరిష్కరించే విధంగా సకాలంలో పరిష్కరించి, అర్జీదారునితో ఫోటో దిగి, చర్యలు చేపడుతున్నపుడు ఫోటో మరొకసారి, సమస్య పరిష్కారం అయిన తర్వాత మరొకసారి ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. బియాండ్ ఎస్ ఎల్ ఎ కి వెళ్లకుండా అధికారులు అప్రమత్తంగా చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు.

స్పందన ద్వారా ప్రజలకు అందాల్సిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలలో వ్యక్తిగత సమస్యలకు సంతృప్తికర పరిష్కారం సకాలంలో జరిగేలా అంతకంటే నాణ్యతగా త్వరితగతిన మెరుగైన రీతిలో అర్జీదారుల సంతృప్తి మేరకు పరిష్కారం లభించేలా “జగనన్నకు చెబుదాం” అనే వినూత్న కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం ప్రారంభించిందని 1902 హెల్ప్ లైన్ నంబర్ ద్వారా ప్రజల ఫిర్యాదులను వేగవంతంగా నాణ్యతగా పరిష్కరించేలా చర్యలు చేపడుతోందని అన్నారు. ఈ ఫిర్యాదులను రాష్ట్ర స్థాయి ప్రభుత్వ విభాగాల కార్యదర్శులు , విభాగాల అధిపతులు, జిల్లా స్థాయి, డివిజన్ స్థాయి, మండల స్థాయి వరకు ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ల ఏర్పాటుతో (PMU) ముఖ్యమంత్రి కార్యాలయం నుండి నేరుగా నిరంతర పర్యవేక్షణ చేస్తూ, సకాలంలో ఫిర్యాదులపై పరిష్కారం నాణ్యతగా అందేలా చర్యలు చేపడతారని తెలిపారు. ఆడిట్ టీమ్ లు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తాయని అన్నారు. ప్రజల ప్రతిస్పందన కూడా తీసుకొని విశ్లేషణ చేసి ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేలా చర్యలు ఉంటాయని అన్నారు. 1902 కు ఫిర్యాదు అందిన వెంటనే సంబంధిత ఫిర్యాదుదారు మొబైల్ కు ఒక యువర్ సర్వీస్ రిక్వెస్ట్ ఐడీ (YSRID) పంపడం జరుగుతుందని, దీనిపై అన్ని స్థాయిలలో ట్రాకింగ్ (పర్వవేక్షణ) చేస్తూ నాణ్యమైన పరిష్కారం చూపేలా అధికారులు పనిచేయాలని అన్నారు.

వాలంటీర్లు వారి పరిధిలోని ప్రతి యాభై గృహాల సందర్శన చేసి ప్రజలకు జగనన్నకు చెబుదాం 1902 హెల్ప్ లైన్ నంబర్ పై అవగాహన కల్పించాలని అన్నారు. అందరు అధికారులు ఎంతో అంకిత భావంతో సీఎం పేరుతో ట్యాగ్ అయిన ఈ కార్యక్రమాన్ని ఆషామాషీగా తీసుకోకుండా తమ సొంత కార్యక్రమంగా భావించి ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేలా పని చేయాలని ఆదేశించారు. జిల్లాకు ప్రత్యేక అధికారిగా కేటాయించబడిన సీనియర్ ఐఎయస్ అధికారి శ్యామలా రావు గారు నెలలో రెండు సార్లు ప్రతి 15 రోజులకు ఒకసారి జిల్లాలలో పర్యటించి రాష్ట్ర ప్రాధాన్యత పథకాలు, సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్లతో కలిసి క్షేత్ర స్థాయిలో పర్యవేక్షిస్తారని తెలిపారు.

జిల్లా ఎస్.పి. పరమేశ్వర రెడ్డి మాట్లాడుతూ స్పందన కార్యక్రమం ప్రతి పోలిస్ స్టేషన్ , జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్నామని ఇంతవరకు కోర్టు కేసులు , రెవెన్యు తగాదాలు వంటివి ఆయా శాఖల కు పంపించడం జరిగేదని , జగనన్నకు చెబుదాం 1902 లో అందిన పిర్యాదులను ఇతర శాఖల సమన్వయంతో అర్జీదారుని సమస్య నిర్ణీత సమయంలో పరిష్కరించనున్నామని అన్నారు. సామాన్య ప్రజలకు సత్వర న్యాయం కొరకే జగనన్నకు చెబుదాం 1902 అని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో డిఆర్ఓ శ్రీనివాసరావు, ఆర్డీఓ లు కిరణ్ కుమార్, రామారావు, జిల్లా అధికారులు జిల్లా విద్యాధికారి శేఖర్, డి ఎం హెచ్ ఓ శ్రీహరి, డి సి హెచ్ ఎస్ ప్రభావతి, పి డి డ్వామా శ్రీనివాస రావు, డి ఎల్ డి వో సుశీల దేవి, ఆదిశేషరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *