విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మాతృ దినోత్సవ సందర్భంగా నక్కా కోటేశ్వరమ్మ, పొట్రు సుబ్బలక్ష్మి పేర్లు మీద నక్కా రాములు, కోటేశ్వరమ్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది. విజయవాడ గాంధీనగర్‌లోని కందుకూరి కళ్యాణ మండపంలో ఆదివారం వ్యవస్థాపక ట్రస్టీలు నక్కా వీరభద్రరావు, రాజ్యలక్ష్మి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ముఖ్యఅతిథిగా నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి హాజరై మహిళలకు చీరల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ప్రపంచంలో అమ్మ రుణం ఎప్పటికి, ఎవరూ తీర్చలేనిదన్నారు. సామాజిక సేవా కార్యక్రమాలు చేయటం ద్వారా తల్లిదండ్రుల రుణం తీర్చుకునే అవకాశం లభిస్తుందన్నారు. నేడున్న పరిస్థితుల్లో తల్లి తండ్రిని పట్టించుకోని నేపథ్యంలో నక్కా వీరభద్రరావు, రాజ్యలక్ష్మి దంపతులు ఇద్దరూ ఒకే మాటతో గత కొన్ని సంవత్సరాలు ట్రస్ట్ ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఇరువురు తమ అత్తమామలను గౌరవించుకుంటూనే సేవా కార్యక్రమాలను నిర్వహించడం అది కొన్ని సంవత్సరాలుగా ప్రజల ఆదరాభిమానాలు పొందటం గర్వకారణం అన్నారు. మరో అతిథి ఉమెన్ ప్రొటెక్షన్ ఎస్పీ కేజీవి సరిత మాట్లాడుతూ తల్లి రూపంలో శక్తి నిక్షిప్తమై ఉంటుందన్నారు. పెదవే పలికిన మాటల్లో తీయని మాటే అమ్మ మాధుర్యాన్ని తెలిపే పాటని గుర్తు చేశారు. ప్రతిరోజు కనిపించే దైవం తల్లి రుణం తీర్చుకుంటానికి ప్రపంచవ్యాప్తంగా మాతృ దినోత్సవ అవకాశం మనకు కల్పించారని అన్నారు. పేగు తెంచుకొని పుడితేనే తల్లి కాదని తల్లి తండ్రి లేని పిల్లలను అక్కున చేర్చుకుంటే తల్లి అయ్యే అవకాశం ఉందని అలాంటి మహాభాగ్యాన్ని పొందాలన్నారు. డాక్టర్ ఎం.సుధ మాట్లాడుతూ తల్లిదండ్రుల పేరుతో ట్రస్ట్‌ని ఏర్పాటు చేసి నిర్విరామ సేవా కార్యక్రమాలు చేయటం స్పూర్తిదాయకమన్నారు. అనంతరం అతిథులను నిర్వాహకులు దుశ్శాలువాతో సత్కరించి జ్ఞాపికలు అందించారు. అనంతరం మహిళలకు చీరల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ నిర్వాహకులు, సభ్యులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News