Breaking News

స్పందన అర్జీదారులకు ఉచిత మజ్జిగ పంపిణీ

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
కృష్ణా జిల్లా కలెక్టరేట్ లో జరుగు స్పందన కార్యక్రమంనకు వచ్చే అర్జీదారులకు ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమమును గత సంవత్సరం కాలం నుండి డి ఆర్ ఓ సి.సి. తూము. వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించడం అభినందనీయమని ఇప్పటి వరకు ఈ కార్యక్రమములో భాగస్వాములైన వారిని కలెక్టర్ పి.రాజా బాబు అభినందించారు. సోమవారం ఉదయం కృష్ణా కలెక్టరేట్ లో ఏర్పాటుచేసిన మజ్జిగ శిబిరాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా వారు కలెక్టరేట్లోని ప్రతి ఒక్క ఉద్యోగి సేవా కార్యక్రమములో పాల్గొనాలని తెలియచేసారు. ఈ కార్యక్రమంలో డి ఆర్ ఓ యం. వెంకటేశ్వర్లు, కలెక్టరేట్ ఏ.ఓ. ప్రసాద్, హారనాధ్, ఉద్యోగ సంఘ నాయకులు శ్యామ్ నాధ్ మరియు ఉద్యోగులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *