Breaking News

ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగడమే జీవితం

-వాహనాలు నడిపే సమయంలో తగిన జాగ్రత్తలతో అప్రమత్తంగా ఉండాలి
-కృత్రిమ అవయవాలను అందజేసిన డీటీసీ యం పురేంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వాహనాలు నడిపే సమయంలో నిర్లక్ష్యం కారణంగా ఎంతోమంది రోడ్డు ప్రమాదాలకులోనై వికలాంగులుగా మారుతున్నారని, ప్రమాదాలలో చేతులు కాళ్లను పోగొట్టుకున్న పలువురు బాధితులకు డీటీసీ యం పురేంద్ర కృత్రిమ అవయవాలను అందజేశారు.

స్థానిక బందర్ రోడ్డు లోని డిటిసి కార్యాలయంలో సోమవారం నాడు సుదీక్షన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో కృత్రిమ అవయవాలను డిటిసి యం పురేంద్ర అందచేశారు. ఈ సందర్భంగా డిటిసి మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలలో అనేకమంది అభాగ్యులు బలవుతున్నారని, ఇందుకు ప్రధాన కారణం వారు రోడ్డు భద్రత అంశాలను పాటించక పోవడం అన్నారు. ఆ కుటుంబాలకు తీరని వ్యధ తో పాటు చాలామంది వికలాంగులుగా మిగిలిపోతున్నారని ఆయన అన్నారు. వికలాంగులుగా మారినప్పటికీ మనోధైర్యాన్ని, ఆత్మ విశ్వాసాన్ని కోల్పోవద్దని నిరాశ చెందకుండా ముందుకు సాగడమే జీవితమని ఆయన అన్నారు. రోడ్డు భద్రతపై ప్రతిఒక్కరు అవగాహన కలిగి ఉండాలన్నారు అప్పుడే ప్రమాదాలను నివారించ గలమన్నారు. వివిధ ప్రమాదాలలో చేతులు, కాళ్ళు పొగుట్టుకున్న బాధితులను నుండి జరిగిన ప్రమాదాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా భాదితులకు కృత్రిమ అవయవాలను డీటీసీ యం పురేంద్ర అందజేశారు. సుదీక్ష ఫౌండేషన్ సంస్థ ఆధ్వర్యంలో కృత్రిమ ఆవయవాలను దానం చేస్తూ వికలాంగులను ఆదుకోవడం ఎంతో గొప్ప విషయమని, ఆ సంస్థ నిర్వాహకులు చిగురుపాటి విమలను డిటిసి అభినందించారు.

సుదీర్ఘన్ పౌండేషన్ నిర్వాహకులు చిగురుపాటి విమల మాట్లాడుతూ ప్రమాదాలకు గురై బాధలు పడుతున్న బాధితులకు సహాయంగా నిలవాలనే సుదీర్ఘన్ పౌండేషన్ ను ఏర్పాటు చెయ్యడమైనదని, ఎన్ఆర్ఐ ల సహకారంతో ప్రతిఏటా భాదితులకు కృత్రిమ అవయవాలను దానం చేస్తూన్నట్లూ తెలిపారు.

ఈ కార్యక్రమంలో మోటార్ వాహన తనిఖీ అధికారి పివి రమణ, రవాణాశాఖ ఉద్యోగుల సంఘం జోనల్ అధ్యక్షుడు యం రాజుబాబు, సుదీక్షన్ ఫౌండేషన్ సభ్యులు ఆర్ రాజకుమారి, కెఎస్ఎస్ ప్రసాద్ మరియు బాధితులు వాళ్ళ కుటింబికులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *