Breaking News

దోమల నియంత్రణ అందరి బాధ్యత..

-వృధా నీటి నిర్మూలన ద్వారానే దోమల నివారణ సాధ్యం..
-ప్రతీ వారం ప్రైడేను డ్రైడే తప్పనిసరిగా నిర్వహించండి..
-అధికారులు ప్రజల భాగస్వామంతోనే డెంగ్యూ నివారణ సాధ్యం..
-జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు.
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అధికారులు, ప్రజల భాగస్వామ్యంతోనే దోమల నివారణ సాధ్య పడుతుందని, ప్రాణాంతక డెంగ్యూ వ్యాధి పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కల్గి ఉండాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు అన్నారు.జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక బాంబేకాలనీ కళ్యాణ మండపంలో అంగన్వాడి, ఆశా వర్కర్లు, శానిటేషన్‌ మలేరియా సిబ్బందికి ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు, ప్లానింగ్‌ బోర్డు వైస్‌ చైర్మన్‌ స్థానిక శాసన సభ్యులు మల్లాది విష్ణు వర్థన్‌ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా కలెక్టర్‌ డిల్లీరావు మాట్లాడుతూ డెంగ్యూ వ్యాధి పట్ల ప్రజల్లో అవగాహన పెంచేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. గతంలో మలేరియా వ్యాధి పట్ల ప్రజల్లో అవగాహన పెంచడం వల్ల నియంత్రించ గలిగామన్నారు. అదే స్పూర్తి తో డెంగ్యూ వ్యాధి లక్షణాలపై అధికారులు ప్రజలకు అవగాహన కల్పించి అరికట్టాలన్నారు. వృధా నీటి నిర్మూలన ద్వారానే దోమలను నివారించ వచ్చునన్నారు. డెంగ్యూ వ్యాధి లక్షణాలను కారణాలను తెలుసుకొని, వాటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన పెంచుకోవాలన్నారు. డెంగ్యూ మలేరియా వంటి వ్యాధులు దోమల ద్వారా సంక్రమిస్తాయన్నారు. డెంగ్యూ వ్యాధి ఈడిస్‌ ఈజిప్ట్‌ దోమ కాటు ద్వారా సంక్రమిస్తుందని ప్రతి ఒక్కరూ దోమలు వ్యాప్తిచెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. డెంగ్యూ వ్యాధిని వ్యాప్తిచేసే ఆడ దోమ ఉదయం, సాయంత్ర వేళల్లో చెమట పట్టే శరీర భాగాలపై కుట్టి రక్తాన్ని పీల్చుకొని నిల్వ ఉన్న నీటి పై గుడ్లను పెట్టి సంతానోత్పత్తి చేసుకొంటాయన్నారు. ప్రజలు ఉదయం సాయంత్రం వేళల్లో కిటికీలను మూసి ఉంచుకోవడం ద్వారా దోమలు ఇంట్లోకి రాకుండా చూసుకోవాలనన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. నిల్వ ఉన్న నీటిలో మాత్రమే డెంగ్యూ దోమలు సంతానోత్పత్తి చేసేందుకు అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ ఇంటిలో, ఆరుబయట నీటి నిల్వలు లేకుండా పొడిగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా డెంగ్యూ వ్యాధిని అరికట్టేందుకు అవకాశం ఉంటుందని కలెక్టర్‌ డిల్లీరావు అన్నారు.ప్లానింగ్‌ బోర్డు వైస్‌ చైర్మన్‌, స్థానిక శాసనసభ్యులు మల్లాది విష్ణు వర్థన్‌ మాట్లాడుతూ నైసర్గిక స్వరూపాన్ని బట్టి నగరంలో కాలువలు కొండలు ఉండటం వల్ల దోమల బెడద ఎక్కువగా ఉంటుందని చెప్పారు. నగర పాలక సంస్థ ఇరిగేషన్‌ అధికారుల సమన్వయంతో బుడమేరులో గుర్రపు డెక్క తొలగింపు కార్యక్రమం నిర్వహిస్తున్నారని తెలిపారు. స్థానిక సచివాలయాన్ని యూనిట్‌గా తీసుకొని ప్రతి వారం ఫ్రౖౖెడేను డ్రైడేగా అమలు చేయాలన్నారు. అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ కనెక్షన్‌ మంజూరులో వెసులుబాటు కల్పించాలన్నారు. యాంటీ లార్వా ఆపరేషన్‌ ప్రక్రియను ప్రతి సచివాయాలనికి అనుసంధానించాలని అన్నారు. అధికారులు ప్రజలు స్థానిక ప్రజాప్రతినిధులు బాగస్వామ్యంతోనగరాన్ని దోమల రహిత నగరంగా తీర్చి దిద్దుదామని శాసనసభ్యులు మల్లాదివిష్ణువర్థన్‌ అన్నారు.నగరపాలక సంస్థ కమీషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుడ్కర్‌ మాట్లాడూ జూన్‌, జూలై మాసాలలో వర్షాలు పడే సమయంలో వర్షపు నీరు నిలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పూల కుండీలు, ఖాళీడబ్బాలు, టైర్లు, ప్లాస్టిక్‌ సీసాలలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు. దోమల నివారణకు అధికారులు తీసుకుంటున్న చర్యలకు ప్రజల సహకారం అవసరమన్నారు. దేశంలోనే తొలిసారిగా మన నగరంలో బుడమేరు కాలువపై డ్రోన్‌ ద్వారా యాంటీ లార్వా ప్రక్రియ నిర్వహించి దోమల నివారణను ఆరికడుతున్నామన్నారు. పలుమార్లు హెచ్చరించినప్పటికీ పరిసరాల్లో ఎక్కడపడితే అక్కడ చెత్త చేయడం మురుగునీటి కాలువలకు ఆటంకం కలిగించే వారిపై జరిమానా విధించేందుకు శానిటేషన్‌ అధికారులు వెనుకాడకూడదన్నారు. దోమల నివారణకు తీసుకుంటున్న చర్యలను స్థానిక ప్రజా ప్రతినిధులు కార్పొరేటర్లకు వివరించి వారి ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని నగరపాలక సంస్థ కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుడ్కర్‌ అన్నారు.కార్యక్రమంలో డిప్యూడి మేయర్‌ అవుతు శ్రీ శైలజారెడ్డి, మలేరియా శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ రామనాథం జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. యం సుహాసిని, వియంసి ఛీప్‌ మెడికల్‌ ఆఫీసర్‌ డా. రత్నావళి, డిఎల్‌టిఏ డా. ఉషారాణి, డిఐఓ డా. అమృత, ఎస్‌ పిహెచ్‌ఓ నరసింహా నాయక్‌, కార్పొరేటర్లు సుల్తానా, దుర్గ, వైద్యాధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *