విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమం ద్వారా నిర్వహించిన శస్త్ర చికిత్సలకు సంబంధించిన డేటాను త్వరితగతిన అన్లైన్లో అప్లోడ్ చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు సంబంధిత అధికారులు, స్వచ్చంద సంస్థల కంటి ఆసుపత్రులకు సూచించారు. వైఎస్సార్ కంటి వెలుగు పథకం ద్వారా నిర్వహించిన కంటి పరీక్షలు, శస్త్రచికిత్సలపై బుధవారం జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు ఆయన కార్యాలయంలో వైద్యాధికారులు, కంటి ఆసుపత్రుల నిర్వహుకులు, స్వచ్చంద సంస్థల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ 60 సంవత్సరాల వయస్సు పై బడిన వారు జిల్లాలో సుమారు 2 లక్షల మందికి పైగా ఉన్నారన్నారు. జిల్లా ఆంధత్వ నివారణ సంస్థ ద్వారా వీరికి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించాలని, అవసరమైన వారికి కళ్ళజోళ్ళు అందించడంతో పాటు శస్త్రచికిత్సలను నిర్వహించవలసిన అవసరం ఉందన్నారు. జిల్లాలో నవంబర్ 2020 నుండి ఇప్పటివరకు 14,900 మందికి కంటి శస్త్ర చికిత్సలను నిర్వహించడం జరిగిందన్నారు. ఆయా శస్త్ర చికిత్సలకు సంబంధించిన వివరాలను కంటి వెలుగు ప్రోర్టల్లో అన్లైన్ అప్లోడిరగ్ కంటి వెలుగు కార్యక్రమం ద్వారా స్వచ్చంద సంస్థ ఊయ్యూరుకి చెందిన రోటరీ కమ్యూనిటి సర్వీస్ ట్రస్ట్ నందు 2,855 శస్త్ర చికిత్సలు జరగగా నేటి వరకు 1600, ప్రభుత్వ ఆసుపత్రి నందు 1702 శస్త్ర చికిత్సలు జరగగా నేటి వరకు 1,155, సిద్దార్థ ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్స్ నందు 312 శస్త్ర చికిత్సలు జరగగా నేటి వరకు 89, సిబియం ఆసుపత్రి నందు 682 శస్త్ర చికిత్సలు జరగగా నేటి వరకు 273, నూజివీడుకు చెందిన గిఫర్డ్ ఆసుపత్రి నందు 2,972 శస్త్ర చికిత్సలు జరగగా నేటి వరకు 167, తాడిగడపకు చెందిన ఎల్ వి ప్రసాద్ కంటి ఆసుపత్రి నందు 2,593 శస్త్ర చికిత్సలు జరగగా నేటి వరకు 157, పెదకాకానికి చెందిన శంకర కంటి ఆసుపత్రి నందు 3,784 మందికి శస్త్రచికిత్సలు నిర్వహించగా ఇప్పటి వరకు 2,591 మందికి సంబంధించిన డేటాను మాత్రమే అప్లోడ్ చేయడం జరిగిందన్నారు. శస్త్ర చికిత్సలు నిర్వహించిన వారికి సంబంధించిన డేటాను ఆయా ఆసుపత్రులు వారం రోజుల లోగా కంటి వెలుగు పోర్టల్ లో అప్లోడ్ చేసేలా చర్యలు తీసుకుని నివేధిక సమర్పించాలని జిల్లా ఆంధత్వ నివారణ సంస్థ ప్రోగ్రామ్ మేనేజర్‌ను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా. యం. సుహాసిని, జిల్లా ఆంధత్వ నివారణ సంస్థ ప్రోగ్రామ్ మేనేజర్ డా. ఏ వెంకట రమణ, స్పెర్టికల్స్ డిస్టిబ్యుషన్ సెల్ అధికారి రఘురామ్, కంటి వెలుగు డిఇవో కిరణ్జ్వోతి, కంటి ఆసుపత్రుల ప్రతినిధులు రవి, ప్రసంగి, రాజశేఖర్, నరేంద్ర, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News